ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర సాయం లేకపోయినా రాష్ట్రం కోసం అవిశ్రాంత కృషి : మమత బెనర్జీ

ABN, First Publish Date - 2021-02-06T01:02:13+05:30

పశ్చిమ బెంగాల్ సర్వతోముఖాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సర్వతోముఖాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందడం లేదని, అయినప్పటికీ రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. 


మమత బెనర్జీ శుక్రవారం శాసన సభలో రూ.2.99 లక్షల కోట్లతో ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతులకు వార్షిక సహాయం పెంపుతో పాటు మరికొన్ని తాయిలాలను ప్రకటించారు. మరి కొద్ది నెలల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె అనేక తాయిలాలను ప్రకటించారు.


ఎస్సీ, ఎస్టీలకు 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. తాత్కాలిక ఇళ్లను పక్కా ఇళ్లుగా మార్చుతామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ మదరసాలకు రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కృషక్ బంధు పథకం లబ్ధిదారులకు సహాయాన్ని పెంచుతామన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం క్రింద ఆర్థిక సహాయం అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతున్నట్లు తెలిపారు. 


న్యూటౌన్‌లో ఆజాద్ హింద్ మాన్యుమెంట్ నిర్మాణం కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ జై హింద్ భవనాలను నిర్మిస్తామన్నారు. వివిధ ప్రాంతాల్లో ‘మా క్యాంటీన్’లను ఏర్పాటు చేస్తామని, నామమాత్రపు ధరలకు ఆహారం అందజేస్తామని తెలిపారు. 


పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు  ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగవచ్చు. 


Updated Date - 2021-02-06T01:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising