ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాలంటైన్స్ డే నాడు తల్లిదండ్రుల పూజలు : శ్రీరామ్ సేన

ABN, First Publish Date - 2021-02-14T00:58:04+05:30

వాలంటైన్స్ డే నాడు తల్లిదండ్రుల పూజలు నిర్వహించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : వాలంటైన్స్ డే నాడు తల్లిదండ్రుల పూజలు నిర్వహించేందుకు శ్రీరామ్ సేన ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 14న కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలతను అడ్డుకోవాలని నిర్ణయించింది. 


శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, తమ  సంస్థ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా వాలంటైన్స్ డే సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర, అశ్లీలమైన కార్యక్రమాలు జరగకుండా నిరోధిస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం తాము ఫిబ్రవరి 14న తల్లిదండ్రుల పూజలు నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 60 చోట్ల ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. పబ్‌లు, బార్లు, షాపింగ్ మాల్స్, ఐస్ క్రీమ్ పార్లర్లు, పార్కులు వంటి చోట్ల అశ్లీల కార్యకలాపాలు జరగకుండా తమ కార్యకర్తలు చర్యలు తీసుకుంటారన్నారు. ఇటువంటి కార్యకలాపాలను నిరోధించడంలో పోలీసులతో సామరస్యంగా తమ కార్యకర్తలు పని చేస్తారని తెలిపారు. 


Updated Date - 2021-02-14T00:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising