ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెకఫీ యాంటీవైరస్‌ సృష్టికర్త అనుమానాస్పద మృతి!

ABN, First Publish Date - 2021-06-25T07:04:02+05:30

సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ల మార్గదర్శి.. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మెకఫీ యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆయనపై అమెరికాలో పన్ను ఎగవేత కేసులు
  • స్పెయిన్‌ జైలులో శిక్ష అనుభవిస్తూ ఆత్మహత్య!
  • పలు దేశాల్లో ఆయనపై కేసులు
  • మెకఫీ మానసిక స్థితిపై అనుమానాలు


మాడ్రిడ్‌, జూన్‌ 24: సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ల మార్గదర్శి.. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మెకఫీ యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సృష్టికర్త.. జాన్‌ మెకఫీ (75) ఇక లేరు! స్పెయిన్‌లోని బార్సిలోనాకు సమీపాన ఉన్న బ్రయాన్స్‌ 2 జైలులో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. డ్రగ్స్‌, గన్స్‌, సెక్స్‌, విలాసవంతమైన జీవితం.. ఇదీ ఆయన ఫిలాసఫీ. అలాంటి వ్యక్తి.. అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థి స్థాయి నుంచి.. పరారీలో ఉన్న నేరస్థుడి స్థాయికి దిగజారిపోయారు. ఒకప్పుడు 100 మిలియన్‌ డాలర్లకు అధిపతిగా ఉన్న వ్యక్తి.. చివరికి ఒక జైలు గదిలో ప్రాణాలు తీసుకున్నారు.


పన్నులను బహిరంగంగా వ్యతిరేకించిన ఆయనపై అమెరికాలో పలు  పన్ను ఎగవేత కేసులున్నాయి. ఆ కేసులకు సంబంధించి ఆయనను అమెరికాకు అప్పగించేందుకు స్పెయిన్‌ జాతీయ న్యాయస్థానం తీర్పువెలువరించిన కొన్ని గంటల వ్యవధిలోనే.. మెకఫీ ఆత్మహత్యకు పాల్పడినట్టు జైలు వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో వార్తలొచ్చాయి. అధికారికంగా దీనికి సంబంధించిన వివరాలు  వెల్లడికాలేదు. కొన్నాళ్లుగా మెకఫీ మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయి. 2019 జూలైలో ఆయన తన స్నేహితులతో కలిసి ఆయుధాలతో ఒక అనుమానాస్పద యాట్‌లో ప్రయాణించిన కేసులో అరెస్టయ్యారు. 2020 అక్టోబరులో అమెరికా నుంచి ఇస్తాంబుల్‌కు తప్పించుకునే  ప్రయత్నంలో బార్సిలోనాలో దొరికిపోయి ఖైదులో ఉన్నారు. 


కన్సల్టింగ్‌, క్రిప్టోకరెన్సీ, తన జీవిత చరిత్రపై హక్కుల్ని అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో (12 మిలియన్‌ డాలర్లు) ఆయన ఆస్తులు పోగుచేశారని, నాలుగేళ్లు (2014-18) ఎలాంటి పన్ను చెల్లింపు రిటర్నులు దాఖలు చేయలేదని మెకఫీపై అమెరికాలో ఆరోపణలు ఉన్నాయి. అవి రుజువైతే ఆయనకు 30 ఏళ్ల జైలు శిక్ష  పడే అవకాశం ఉంది. క్రిప్టో కరెన్సీ గురువుగా  పేరు సంపాదించుకున్న ఆయనకు ట్విటర్‌లో 10 లక్షలకుపైగా అనుచరులు ఉన్నారు.  ‘‘నా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. స్నేహితులు దూరమయ్యారు.  నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. అయితే నేను దేనికీ బాధపడడంలేదు’’ అంటూ 16న మెకఫీ ట్వీట్‌ చేశారు.



ఎవరీ మెకఫీ..

మెకఫీ.. అనగానే ఆయన అభిమానులకు గుర్తొచ్చేది ఆయన విలాసవంతమైన జీవనమే. అమెరికాలోని టెనెసీ నుంచి మధ్య అమెరికా, కరేబియన్‌ వరకు అన్ని దేశాల్లోనూ న్యాయపరమైన పలు చిక్కులను ఎదుర్కొన్న వివాదాస్పదుడాయన. ఇంగ్లండ్‌లో 1945లో పుట్టిన మెకఫీ.. చిన్నప్పుడే తల్లిందండ్రులతో కలిసి అమెరికాలోని వర్జీనియాకు చేరుకున్నారు. 1987లో  మెకఫీ కంపెనీ స్థాపించారు. ఆ కంపెనీని 2011లో ఇంటెల్‌ కొనుగోలు చేసింది. తర్వాత ఆయన ఎంజీటీ ఇన్వె్‌స్టమెంట్‌కు,  క్రిప్టో కరెన్సీ కంపెనీకి సీఈవోగా వ్యవహరించారు. 2008లో బ్రెజిల్‌కు మకాం మార్చారు. రియల్‌ ఎస్టేట్‌ లాంటి వ్యాపారాలు చేసి చేతులు కాల్చుకున్నారు.


ఓ హత్యకేసులో ఆయనపై అనుమానాలు రావడంతో బ్రెజిల్‌ నుంచి గ్వాటేమాలకు పారిపోయారు. అక్కడి నుంచి అమెరికాలోని మియామీకి చేరుకున్నాడు. లిబరేషన్‌ పార్టీ తరపున అధ్యక్ష  ఎన్నికల్లో నిలబడతానని ప్రకటించినా.. నామినేషన్‌ దక్కలేదు. 2017లో బిట్‌కాయిన్‌వైపు మళ్లారు. 2014-18 నడుమ పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన స్పెయిన్‌లో అరెస్టై.. చివరికిలా అర్ధంతరంగా చనిపోయారు!


Updated Date - 2021-06-25T07:04:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising