ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ సమావేశం

ABN, First Publish Date - 2021-06-24T21:20:24+05:30

ఇక జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్రం సముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దు అనంతరం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు మాత్రమే జరిగాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి అసెంబ్లీ ఉన్నప్పటికీ ఎన్నికలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ నేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జమ్మూ కశ్మీర్‌కు చెందిన నలుగురు మాజీ మఖ్యమంత్రులు ఫారూఖ్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా మరో 10 మంది నేతలు హాజరు అయ్యారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం నాటి నుంచి కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితిలో లేవు. జమ్మూ కశ్మీర్‌ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడం దీనికి ఒక కారణం. అయితే జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రస్థాయి హోదాపై ఇస్తారనే ప్రచారం విస్తృతంగా జరగబోతోంది. ప్రస్తుతం జరుగుతోన్న సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్రం సముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దు అనంతరం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు మాత్రమే జరిగాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి అసెంబ్లీ ఉన్నప్పటికీ ఎన్నికలు జరపకుండా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలోనే పాలన సాగిస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్రానికి కొన్ని ఉద్దీపనలతో ఊరట కల్పించే యోచనలో కేంద్రం ఉందని ఓ వైపు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమ రాష్ట్రం కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకుంటామని, ఈ విషయమై ప్రధానితో చర్చిస్తామని కశ్మీర్ నేతలు సమావేశానికి ముందు తేల్చి చెప్పారు.


జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన అనంతరం రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విడదీసి రెండింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. ఈ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్‌లోని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. రాజకీయంగా కశ్మీర్‌ను కుదిపేసిన ఈ నిర్ణయం జరిగిన రెండేళ్ల తర్వాత అక్కడి రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ సమావేశానికి పిలవడం ఇదే మొదటిసారి. ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనే ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది.



Updated Date - 2021-06-24T21:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising