ప్రజలు చనిపోతుంటే మోదీ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు : నవాబ్ మాలిక్
ABN, First Publish Date - 2021-04-17T22:06:55+05:30
ఆక్సిజన్ కొరత తీర్చాలంటూ సీఎం ఉద్ధవ్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి, మాట్లాడారని వస్తున్న వార్తలపై మంత్రి నవాబ్
ముంబై : ఆక్సిజన్ కొరత తీర్చాలంటూ సీఎం ఉద్ధవ్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి, మాట్లాడారని వస్తున్న వార్తలపై మంత్రి నవాబ్ మాలిక్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న ఆక్సిజన్ కొరతపై ప్రధాని మోదీతో మాట్లాడడానికి సీఎం ఉద్ధవ్ ప్రయత్నించిన మాట వాస్తవమే అని వెల్లడించారు. అయితే ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనలో ఉన్నారని అధికారుల నుంచి సమాధానం వచ్చిందని నవాబ్ మాలిక్ స్పష్టతనిచ్చారు. ‘‘రాష్ట్రంలో నెలకొన్న ఆక్సిజన్ కొరతపై ప్రధాని మోదీతో ఫోన్‌లో సంభాషించడానికి సీఎం ఉద్ధవ్ ప్రయత్నించారు. అయితే ప్రధాని బెంగాల్ పర్యటనలో ఉన్నారని సమాధానం వచ్చింది. ఓ వైపు ప్రజలు చనిపోతుంటే, మోదీ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు’’ అని నవాబ్ మాలిక్ విరుచుకుపడ్డారు.
Updated Date - 2021-04-17T22:06:55+05:30 IST