ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ వలసదారులు అభివృద్ధి నిరోధకులు : మోదీ

ABN, First Publish Date - 2021-04-24T00:09:01+05:30

‘సోనార్ బెంగాల్’ కు తాము కట్టుబడే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలు కేవలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ‘సోనార్ బెంగాల్’ కు తాము కట్టుబడే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే మార్చే ఎన్నికలు కావని,  బెంగాల్ ఆకాంక్షలను తీర్చే ఎన్నికలని అభివర్ణించారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బెంగాల్ ప్రజలనుద్దేశించి ‘వర్చువల్ ప్రసంగం’ చేశారు. బెంగాల్ మొత్తం పరివర్తన కోసం ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. మెరుగైన జీవితాల కోసం, మంచి అభివృద్ధి కోసం, నాణ్యమైన విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం బెంగాల్‌లోని ప్రతి పల్లె, పట్టణమూ ఎదురు చూస్తోందని తెలిపారు.


ప్రభుత్వంలోని ప్రతి శాఖా అత్యంత నిజాయితీతో విధులు నిర్వర్తించే శాఖగా మారాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అలాగే వివక్ష లేని , సామరస్యతతో కూడిన రాష్ట్రం కోసం బెంగాల్ ప్రజలు ఓటు వేశారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సాంకేతికతను ఉపయోగించి బెంగాల్ రూపు రేఖలను మార్చేస్తామని, సంతోషకరమైన, ఆహ్లాదంతో కూడిన బెంగాల్‌ను తెస్తామని హామీ ఇచ్చారు. అయితే అక్రమ వలసదారులు, సిండికేటర్లు అభివృద్ధి నిరోధకులుగా మారారని మండిపడ్డారు. కోవిడ్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కారణంగా బెంగాల్ ప్రచారానికి రాలేకపోయాయని, అందుకు ప్రజలు తనను క్షమించాలని మోదీ కోరారు. 

Updated Date - 2021-04-24T00:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising