‘మోదీ ఒక్కరే సమర్ధుడైన ప్రధాని’
ABN, First Publish Date - 2021-08-27T18:14:19+05:30
భవిష్యత్తులో దేశానికి ఎలాంటి భీకర సవాలు ఎదురైనా సమర్ధవంతంగా తిప్పికొట్ట సత్తా, సామర్ధ్యం మన ప్రధాని నరేంద్రమోదీకి ఉన్నాయని ప్రముఖ సాహితీవేత్త ఎస్‌ఎల్.బైరప్ప పేర్కొన్నా
- సాహితీవేత్త ఎస్‌ఎల్ భైరప్ప
బెంగళూరు: భవిష్యత్తులో దేశానికి ఎలాంటి భీకర సవాలు ఎదురైనా సమర్ధవంతంగా తిప్పికొట్ట సత్తా, సామర్ధ్యం మన ప్రధాని నరేంద్రమోదీకి ఉన్నాయని ప్రముఖ సాహితీవేత్త ఎస్‌ఎల్.బైరప్ప పేర్కొన్నారు. మైసూరులోని కువెంపు నగర్‌లో ఆయనను కన్నడ సాంస్కృతిక శాఖా మంత్రి వి.సునీల్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సంద రస్భంగా భైరప్ప కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ప్ర తిపక్షాలన్నీ ఏకమైన రాహుల్‌గాంధీని ప్రధాని పదవిలో కూర్చోబెడితే ఆయన ఏ విధంగానూ నిభాయించలేరని భైరప్ప అభిప్రాయపడ్డారు. కేంద్రంలో యుపిఎ పాలన సాగిన రోజుల్లో దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట బాంబుల మోత వినిపించేదని మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు దాదాపుగా తోకముడిచారన్నారు. దేశ భవిష్యత్తుకోసం మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అందరికీ నచ్చి ఉండకపోవచ్చు. అయితేప్రపంచ చిత్రప టంలో భారత్ గత ఏడేళ్ళుగా పొందిన గొప్ప గుర్తింపు ముందు చిన్న చిన్న సమస్యలన్నీ బలాదూర్ అన్నారు. దేశం ముందు అనే భావన ప్రజలందరిలోనూ రావాలని ఆకాంక్షించారు. మోదీలాగే తాను కూడా పచ్చి వాస్తవాలే మాట్లాడతానని అందుకే కొందరికి తాను నచ్చనని భైరప్ప వ్యాఖ్యానించారు. కన్నడ శాఖకు జవసత్వాలు నింపాలని అంతకుముందు సునీల్‌కుమార్‌ను భైరప్ప కోరారు.
Updated Date - 2021-08-27T18:14:19+05:30 IST