నిఫా వైరస్‌పై నిఘా

ABN, First Publish Date - 2021-09-09T17:47:24+05:30

పొరుగురాష్ట్రం కేరళలో నిఫా వైరస్‌ అతివేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో పూర్తిస్థాయిలో అప్రమత్తత పాటించాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్య

నిఫా వైరస్‌పై నిఘా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కేరళ సరిహద్దుల్లో రెడ్‌ అలర్ట్‌... 

- అధికారులకు సీఎం సూచన


బెంగళూరు: పొరుగురాష్ట్రం కేరళలో నిఫా వైరస్‌ అతివేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో పూర్తిస్థాయిలో అప్రమత్తత పాటించాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళ సరిహద్దు ప్రాంతంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించాల్సిందిగా జిల్లాధికారులకు సూచించామని తెలిపారు. ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందన్నారు. సరిహద్దు జిల్లాల ఇన్‌చార్జ్‌ మంత్రులను కూడా అప్రమత్తం చేశామన్నారు. ఇంతవరకు నిఫా వైర్‌సకు సంబంధించి కేసులేవీ లేకపోయినా నిర్లక్ష్యం వలదని ఆయన ప్రజలను కోరారు. బెంగళూరు నగర ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించేందుకు శాటిలైట్‌ రింగ్‌రోడ్ల పథకాన్ని సాధ్యమైన త్వరగా చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశానని సీఎం తెలిపారు. కేంద్ర భూ ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరితో భేటీ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించానన్నారు. శాటిలైట్‌ రింగ్‌రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూముల స్వాధీనం కోసం రూ.1560 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశామన్నారు. ఇందులో 30శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధమన్నారు. రాష్ట్రంలో అతివృష్టి వరదల కారణంగా దెబ్బతిన్న జాతీయ రహదారుల మరమ్మత్తులకు రూ.184.85 కోట్లను విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిందన్నారు.


Updated Date - 2021-09-09T17:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising