ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్చకులుగా అన్ని కులాల వారు..

ABN, First Publish Date - 2021-07-25T15:43:54+05:30

రాష్ట్రంలో అన్ని కులాల వారు అర్చక వృత్తిలో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్టు హిందూ దేవదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. తిరుప్పూర్‌ జిల్లా తిరుమురుగన్‌పూండిలో ప్రసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

            - మంత్రి శేఖర్‌బాబు


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో అన్ని కులాల వారు అర్చక వృత్తిలో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్టు హిందూ దేవదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. తిరుప్పూర్‌ జిల్లా తిరుమురుగన్‌పూండిలో ప్రసిద్ధిచెందిన తిరుమురుగనాథస్వామి ఆలయం, వీరరాఘవపెరుమాళ్‌స్వామి ఆలయం, విశ్వేశ్వరస్వామి ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మరమ్మతులను శనివారం మంత్రి శేఖర్‌బాబు, సహచర మంత్రి స్వామినాథన్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శేఖర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచనల మేరకు ఆలయాల్లో ఆగమశాస్త్రం ప్రకారం 12 ఏళ్లకు ఒకసారి కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు తెలిపారు. అన్ని కులాల వారు ఆలయాల్లో అర్చకులుగా పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతించిందని, ముందుగా చిన్న ఆలయాల్లో ప్రవేశపెట్టనున్న ఈ పథకాన్ని క్రమక్రమంగా మిగతా ఆలయాలకు కూడా విస్తరింపజేస్తామన్నారు. మంత్రుల వెంట జిల్లా కలెక్టర్‌ వినీత్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ క్రాంతికుమార్‌, ఎమ్మెల్యే సెల్వరాజ్‌లున్నారు.

Updated Date - 2021-07-25T15:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising