ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శలు

ABN, First Publish Date - 2021-06-08T03:13:38+05:30

ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.  ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ప్రధాని మోదీ మాట్లాడిన అబద్ధాలను చూస్తుంటే మనస్సు నొచ్చుకుంటోందని రాహుల్ అన్నారు. కోవిడ్ టీకా అందరికీ ఉచితమైతే, ప్రైవేట్ ఆస్పత్రులు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నాయి? అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మరోవైపు ప్రధాని ప్రసంగంపై సీపీఎం కూడా విమర్శలు చేసింది. ‘‘వ్యాక్సినేషన్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేయడం, సుప్రీం కోర్టు కూడా విమర్శలు చేయడంపై ప్రధాని మోదీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఉచిత టీకా వేయాలన్న డిమాండ్‌ను చివరికి అంగీకరించాల్సి వచ్చింది. కానీ టీకా కొరతగా ఉన్న సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులకు 25 శాతం ఇవ్వాలన్న నిర్ణయాన్ని మేం తప్పుపడుతున్నాం’’ అని సీపీఎం ట్వీట్ చేసింది. ఇక ఎన్సీపీ కూడా మోదీ ప్రసంగంపై విమర్శలు చేసింది. ‘‘సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇమేజ్‌ను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి నుంచి రాష్ట్రాల డిమాండ్ ప్రకారం లభిస్తాయని భావిస్తున్నాం. చాలా ఆలస్యం జరిగింది’’ అని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా స్పందించారు. ‘‘మరోసారి అనవసరమైన ప్రసంగం చేసినందుకు మోదీకి ధన్యవాదాలు. వ్యాక్సినేషన్ విధానంలో మార్పు వచ్చిందంటే అది సుప్రీం ఉత్తర్వుల పుణ్యమే అనిపిస్తోంది. అయినా వ్యాక్సినేషన్ విధానంలో రాష్ట్రాలపై ఆరోపణలు వస్తున్నాయి. వ్యాక్సినేషన్ విషయంలో మోదీ సర్కార్ విఫలమైంది’’ అని అసదుద్దీన్ విమర్శించారు. 

Updated Date - 2021-06-08T03:13:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising