కోవిడ్ స్ట్రెయిన్ భయంతో జనం... బ్రిటన్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం...
ABN, First Publish Date - 2021-01-08T18:53:20+05:30
బ్రిటన్ నుంచి మన దేశానికి విమాన సేవలు శుక్రవారం పునఃప్రారంభమయ్యాయి
న్యూఢిల్లీ : బ్రిటన్ నుంచి మన దేశానికి విమాన సేవలు శుక్రవారం పునఃప్రారంభమయ్యాయి. అత్యంత వేగంగా వ్యాపించే కొత్త కోవిడ్ స్ట్రెయిన్ భయాల నేపథ్యంలో గత ఏడాది డిసెంబరు 23న ఇరు దేశాల మధ్య వైమానిక సేవలను తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. మన దేశం నుంచి బ్రిటన్‌కు వైమానిక సేవలు బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.
లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానంలో 246 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం శుక్రవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ మొదట బ్రిటన్‌లోనే కనిపించింది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తోందని నిర్థారించారు. మన దేశంలో ఈ కేసుల సంఖ్య 82కు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
శుక్రవారం ఢిల్లీ చేరుకున్న ప్రయాణికులకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, వీరు కనీసం 10 గంటలపాటు వేచి చూసిన తర్వాత ఇతర నగరాలకు వెళ్ళవలసి ఉంటుంది.
ఇదిలావుండగా, జనవరి 23 వరకు రోజుకు 30 విమానాలను భారత్-బ్రిటన్ మధ్య నడుపుతారు. అయితే జనవరి 31 వరకు ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Updated Date - 2021-01-08T18:53:20+05:30 IST