ఆధ్యాత్మికవేత్త బంగారు అడిగలర్‌తో మోదీ భేటీ
ABN, First Publish Date - 2021-02-14T20:58:42+05:30
ఆధ్యాత్మికవేత్త బంగారు అడిగలర్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
చెన్నై : ఆధ్యాత్మికవేత్త బంగారు అడిగలర్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం కలిశారు. దేశీయంగా తయారైన యుద్ధ ట్యాంకును భారత సైన్యానికి అప్పగించడంతోపాటు వివిధ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మోదీ చెన్నై వచ్చారు. కొన్ని ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
బంగారు అడిగలర్ ఆది పరాశక్తి చారిటబుల్ మెడికల్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ అధ్యక్షుడు. ఆయన అనుచరులు ఆయనను ‘అమ్మ’ అని పిలుస్తారు. ఆయనకు పెద్ద సంఖ్యలో అనుచరులు, భక్తులు ఉన్నారు. ఆయన ఆది పరాశక్తి అవతారమని ఆయన అనుచరులు, భక్తులు విశ్వసిస్తారు. దేవాలయాలు, ఆధ్యాత్మికతలలో ఆయన సంస్కరణలు తీసుకొచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
Updated Date - 2021-02-14T20:58:42+05:30 IST