ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధీర వనితా....... గుడ్‌లక్...

ABN, First Publish Date - 2021-05-29T22:23:58+05:30

పుల్వామా అమరుడు మేజర్ విబూతి శంకర్ దౌండియాల్ సతీమణి నిఖిత కౌల్ శనివారం ఆర్మీలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :  పుల్వామా అమరుడు మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ సతీమణి నిఖిత కౌల్ శనివారం ఆర్మీలో చేరారు. లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. సౌత్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి స్వయంగా ఆమె భుజాలపై స్టార్స్ పెట్టి సైన్యంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘విభూ..... నేనూ నీ దారిలోనే ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. నా ప్రయాణంలో ఎప్పుడూ నువ్వు నాతోనే ఉంటావన్నది నా ప్రగాఢ నమ్మకం. ఇప్పుడే నా ప్రయాణం ప్రారంభమైంది. నాపై నమ్మకముంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా కుటుంబీకులందరికీ ధన్యవాదాలు. నాపై అందరూ నమ్మకం పెట్టుకున్నారు కాబట్టే నా ప్రయాణం సులభతరమవుతుందని నా నమ్మకం’’ అని నిఖిత కౌల్ వ్యాఖ్యానించారు. 


2019 ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో మేజర్ విభూతి శంకర్ అమరులయ్యారు. అప్పటికి ఆమెకు వివాహమై కేవలం తొమ్మిది నెలలే. అందరూ జాలి పడ్డారు. ఆమె మాత్రం గర్వపడమని అందరికీ చెప్పారు. ఐలవ్యూ అంటూ ఓ ముద్దు పెట్టి ఆ అమరుడ్ని సాగనంపింది. 



Updated Date - 2021-05-29T22:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising