ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీజీ.. మీ వాగ్దానం ఏమైంది? : అరుణాచల్‌లో చైనా గ్రామంపై రాహుల్

ABN, First Publish Date - 2021-01-19T17:32:42+05:30

ఆక్రమణల పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న చైనా తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించిందన్న వార్తలపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆక్రమణల పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న చైనా తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించిందన్న వార్తలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. ప్రధాని తాను చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. నేరుగా ప్రధాని పేరును ప్రస్తావించకుండానే... 'దేశాన్ని ఎవరి ముందు తలవంచనీయమని చెప్పారు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేసుకోండి' అని రాహుల్ ట్వీట్ చేశారు. భారత భూభాగంలో చైనా నిర్మించిన గ్రామానికి చెందిన స్క్రీన్‌షాట్‌ను కూడా తన ట్వీట్‌కు రాహుల్ జోడించారు. కాగా, రాహుల్ ట్వీట్‌ను బీజేపీ వెంటనే తిప్పికొట్టింది. మెక్‌మోహన్ రేఖ వెంబడి భారత భూభాగంలో చైనా గ్రామం నిర్మించడం కొత్త పరిణామమేమీ కాదని పేర్కొంది.


అరుణాచల్ బీజేపీ ఎంపీ తాపిర్ గవో మాట్లాడుతూ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని వెనక్కి పంపించేందుకు భారత ఆర్మీ ఎలాంటి ఆపరేషన్‌ చేపట్టకుండా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీనే ఆపినట్టు ఆరోపించారు. 80వ దశకంలోనే చైనా రోడ్డు నిర్మాణం జరిపిందని, లాంగ్జూ నుంచి మజా రోడ్డు నిర్మించి కూడా రాజీవ్ హయాంలోనేని, తవాంగ్‌లోని ఒక వ్యాలీని ఆక్రమించుకుందని అన్నారు. అప్పటి ఆర్మీ చీఫ్ పీఎల్‌ఏను వెనక్కి పంపేందుకు ఆపరేషన్ చేపట్టాలనుకుని ప్లాన్ చేసినప్పటికీ రాజీవ్ గాంధీ అనుమతించలేదని చెప్పారు. కాంగ్రెస్ తప్పుడు విధానంలో వెళ్లిందని, కనీసం సరిహద్దుకు రోడ్డు కూడా నిర్మించలేకపోయిందని అన్నారు. కొత్త గ్రామాల నిర్మాణం కొత్తేమీ కాదని, ఇదంతా కాంగ్రెస్ చలవేనని బీజేపీ ఎంపీ అన్నారు.


చైనా భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి 101 ఇళ్లు నిర్మించినట్టు ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ తాజాగా స్పందిస్తూ, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. తాము కూడా సరిహద్దుల్లో మౌలిక వసతులు మెరుగుపరేచేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నట్టు పేర్కొంది. దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణకు అన్ని చర్యలూ చేపడుతున్నట్టు పేర్కొంది.

Updated Date - 2021-01-19T17:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising