ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకా సాంకేతికత బదిలీకి ఒప్పుకొన్నది మేం ఒక్కరమే: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

ABN, First Publish Date - 2021-06-06T06:24:28+05:30

టీకా సాంకేతికతను ఇతర దేశాలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఏకైక దేశం రష్యా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెంట్‌ పీటర్స్‌బర్గ్‌(రష్యా), జూన్‌ 5 : టీకా సాంకేతికతను ఇతర దేశాలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఏకైక దేశం రష్యా మాత్రమేనని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి తయారీకి భారత కంపెనీలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్పుత్నిక్‌ టీకా ఉత్పత్తిని విదేశాలకు విస్తరించేందుకు యోచిస్తున్నామని, ఇప్పటికే 66 దేశాల్లో తమ టీకా విక్రయిస్తున్నామన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో స్పుత్నిక్‌ వి టీకాను ఉత్పత్తి చేసేందుకు భారత ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ నుంచి ప్రాథమిక అనుమతి లభించిన ఒక రోజు తర్వాత పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.


భారత ఫార్మా కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీ్‌సకు ఈ టీకా అత్యవసర వినియోగానికి ఏప్రిల్‌లోనే అనుమతులొచ్చాయి. రష్యా సావెరిన్‌ వెల్త్‌ ఫండ్‌ సహకారంతో పనేసియా బయోటెక్‌.. భారత్‌లో స్పుత్నిక్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. స్పుత్నిక్‌ సామర్థ్యంపై వచ్చిన ఆరోపణలను ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థల ఎడిటర్లతో జరిగిన వర్చువల్‌ భేటీలో పుతిన్‌ ఖండించారు. యూర్‌పలో టీకా నమోదులో జాప్యానికి వాణిజ్య ప్రయోజనాలే కారణమని అన్నారు.  


Updated Date - 2021-06-06T06:24:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising