రెండో రోజు ఆరు రాష్ట్రాల్లోనే కొనసాగిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ
ABN, First Publish Date - 2021-01-18T01:54:07+05:30
రెండో రోజు ఆరు రాష్ట్రాల్లోనే కొనసాగిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఇవాళ 553 సెషన్ సైట్స్‌లో 17,072 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చారు.
ఢిల్లీ: రెండో రోజు ఆరు రాష్ట్రాల్లోనే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇవాళ 553 సెషన్ సైట్స్‌లో 17,072 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. రెండు రోజుల్లో మొత్తం 2,24,301 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తొలిరోజు అత్యధికంగా 2,07,229 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. రెండు రోజుల్లో 447 ప్రతికూల సంఘటనలు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. కేవలం మూడు కేసులు మాత్రం ఆసుపత్రిలో చేరే అవసరం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ముగ్గురిలో ఇద్దరిని డిశ్చార్జ్ చేశామని, మరొకరు వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో రోజు వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో 308, తమిళనాడులో 165, కర్ణాటక 64, అరుణాచల్ ప్రదేశ్ 14, కేరళ, మణిపూర్‌లో ఒక్కో సెషన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు.
Updated Date - 2021-01-18T01:54:07+05:30 IST