ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ఫుత్నిక్-వీ తయారు చేసేందుకు డీసీజీఐ అనుమతి కోరిన ‘సీరం’

ABN, First Publish Date - 2021-06-03T23:50:26+05:30

రష్యా టీకా స్ఫుత్నిక్-వీని తయారు చేసేందుకు అనుమతించాలంటూ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రష్యా టీకా స్ఫుత్నిక్-వీని తయారు చేసేందుకు అనుమతించాలంటూ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ టీకాను పరీక్షించేందుకు, క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు కూడా అనుమతించాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అనుమతి లభిస్తే..క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ‘సీరం’ సంస్థకు మార్గం సుగమమవుతుంది. క్లినికల్ ట్రయల్స్‌లో ఆశించిన ఫలితాలు వెలువడితే..సీరం స్ఫూత్నిక్ వీ ఉత్పత్తి చేయడం ప్రారంభించవచ్చు. ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపకల్పన చేసిన కరోనా టీకాను ‘సీరం’ భారత్‌లో కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటూ నోవోవ్యాక్స్ టీకాను తయారు చేసేందుకు కూడా సీరం సిద్ధంగా ఉంది. అయితే..అమెరికా ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన కీలక అనుమతులు రావాల్సి ఉంది. 


రష్యా టీకా స్ఫూత్నిక్ వీని తయారు చేసేందుకు ప్రస్తుతం ఆరు భారత సంస్థలు ఇప్పటికే అనుమతులు పొందాయి. డా.రెడ్డీస్ ల్యాబ్, గ్లాండ్ ఫార్మా, హెటిరో బయోఫార్మా, పనాసీయా బయోటెక్, స్టెల్లిస్ బయోఫార్మా, వర్చోవ్ బయోటెక్ సంస్థలకు స్ఫూత్నిక్ వీ ఉత్పత్తి చేసే అనుమతి ఉంది. స్ఫుత్నిక్‌ను మార్కెట్ చేస్తున్న రష్యా సోవరిన్ వెల్త్ ఫ్ండ్ ఆర్‌డీఐఎఫ్‌తో ఈ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. కాగా..భారత్‌లో రష్యా టీకా తొలి 125 మిలియన్ డోసులను విక్రయించేందుకు డా. రెడ్డీ ల్యాబ్ ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. టీకా ఉత్పత్తని కూడా ప్రారంభించింది. మరోవైపు..స్ఫూత్నిక్-వీకి చెందిన 30 లక్షల డోసులు మంగళవారం నాడు హైదరాబాద్ చేరుకున్నాయి. ఇంత పెద్దస్థాయిలో కరోనా టీకా దిగుమతి కావడం దేశంలో ఇదే తొలిసారి. అయితే..ఇలా దిగుమతి చేసుకున్న టీకా ధర దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుందని సమాచారం.  భారత్‌లో ఈ టీకా రూపొందిస్తే ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని డా. రెడ్డీస్ ల్యాబ్స్ గతంలో పేర్కొంది. 

Updated Date - 2021-06-03T23:50:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising