ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీలో చేరేందుకు శశికళ యత్నం!

ABN, First Publish Date - 2021-07-02T16:08:30+05:30

మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ అదే పనిగా మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా శాఖ నాయకులు, కార్యకర్తలతో జరిపిన సంభాషణలను ఆడియోలుగా వెలువరిస్తున్న నే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

          - అడ్డుకోవాలని నేతల తీర్మానం

          - ఆడియోలపై ఎడప్పాడి సమీక్ష


చెన్నై: మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ అదే పనిగా మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా శాఖ నాయకులు, కార్యకర్తలతో జరిపిన సంభాషణలను ఆడియోలుగా వెలువరిస్తున్న నేపథ్యంలో అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి గురువారం ఉదయం పార్టీ ప్రముఖులు, చెన్నై జిల్లా శాఖల నాయకులతో గురువారం ఆకస్మికంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శశికళ పార్టీలో చేరేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాలను అడ్డుకోవాలని పార్టీ నాయకులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. శశికళ తాజాగా రెండు ఆడియోలను విడుదల చేశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ మృతి చెందినప్పుడు పార్టీలో చీలికలు ఏర్పడిందని, ఆ సమయంలో ఆయన సతీమణి జానకి వర్గానికి చెందిన నాయకులు, శాసనసభ్యులను చేర్చుకోవాలని జయకు తానే సలహా ఇచ్చానని శశికళ ప్రకటించారు. అన్నాడీఎంకే మాజీ శాసనసభ్యుడు కదిర్‌గాము తదితరులతో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ అన్నాడీఎంకేలో ప్రస్తుతం ఏర్పడిన తగాదాలన్నీ అన్నదమ్ముల మధ్య జరిగే తగాదాల వంటివని  అన్నారు. అక్రమార్జన కేసులో తాను బెంగళూరు జైలుకు వెళుతూ పార్టీ శాసనసభ్యులెవరినీ తొలగించవద్దని, మూడు మాసాల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దుతానని ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంకు సలహా ఇచ్చానని, అయితే ఊహించని విధంగా 18 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించరాని ఆమె తెలిపారు. ఈ కారణం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి రావాల్సిన అన్నాడీఎంకే ఓటమిపాలైందన్నారు. పార్టీశ్రేణులంతా నాయకులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారిని ప్రత్యక్షంగా కలుసుకోవడమే తన ప్రధాన కర్తవ్యమని తెలిపారు.


నేతలతో ఎడప్పాడి భేటీ

అన్నాడీఎంకేలో చిచ్చురగిల్చేందుకు శశికళ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరిపేందుకుగాను ఆ పార్టీ ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి చెన్నై నగరపరిధిలోని తొమ్మిది జిల్లాశాఖల కార్యదర్శులతో ఆకస్మికంగా సమావేశమయ్యారు. రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా శాఖ కార్యదర్శులు జయకుమార్‌, వెంకటేష్‌బాబు, ఆర్కే రాజేష్‌, ఆదిరాజారామ్‌, వేళచ్చేరి అశోక్‌, టి.నగర్‌ సత్యా, విరుగై రవి, బాలగంగా, కేపీ కందన్‌ తదితరులు హాజరయ్యారు. వీరితోపాటు మాజీ మంత్రి గోకుల ఇందిర, ఇతర నేతలు పాల్గొన్నారు. శశికళ రోజూ వెలువరిస్తున్న ఆడియోలపై ప్రధానంగా వీరంతా చర్చలు జరిపారు. శశికళతో ఫోన్‌లో సంభాషిస్తున్న పార్టీ నేతలు, మాజీ శాసనసభ్యులపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఎడప్పాడి జిల్లా శాఖ కార్యదర్శుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో త్వరలో తొమ్మిది జిల్లాల్లో జరుగ నున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరిం చాల్సిన వ్యూహరచనలు గురించి కూడా సమగ్రంగా చర్చలు జరిపారు. పార్టీ సమన్వయకర్త ఒ. పన్నీర్‌సెల్వం తేని జిల్లాలో పర్యటిస్తుండటంతో ఈ సమావేశానికి హాజరుకాలేదు.

Updated Date - 2021-07-02T16:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising