ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల్లో న్యాయమూర్తుల కొరత

ABN, First Publish Date - 2021-03-18T08:05:04+05:30

తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులతో సహా కింది కోర్టుల్లోనూ జడ్జిల కొరత ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టులతో సహా కింది కోర్టుల్లోనూ ఇదే పరిస్థితి: కేంద్రం


తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులతో సహా కింది కోర్టుల్లోనూ జడ్జిల కొరత ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణ హైకోర్టులో ఉండాల్సిన 24 మంది న్యాయమూర్తులకుగాను ప్రస్తుతం 14 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులకుగాను ప్రస్తుతం 19 మంది ఉన్నారని చెప్పారు. తెలంగాణలోని కింది కోర్టుల్లో ఉండాల్సిన 474 మంది జడ్జిలకుగాను 378 మంది ప్రస్తుతం ఉన్నారని, 96 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీలో 607 జడ్జి పోస్టులకుగాను 97 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

Updated Date - 2021-03-18T08:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising