ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాట ‘నీట్‌’కు మరో విద్యార్థి బలి

ABN, First Publish Date - 2021-10-31T08:08:36+05:30

మరికొద్దిరోజుల్లో నీట్‌ పరీక్ష ఫలితాలు రానుండగా.. ఉత్తీర్ణతపై భయంతో తమిళనాట మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోయంబత్తూర్‌ జిల్లా పుదూర్‌కుప్పంకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మరికొద్దిరోజుల్లో నీట్‌ పరీక్ష ఫలితాలు రానుండగా.. ఉత్తీర్ణతపై భయంతో తమిళనాట మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోయంబత్తూర్‌ జిల్లా పుదూర్‌కుప్పంకు చెందిన కుప్పుస్వామి-వలర్మతి దంపతుల కుమారుడు కీర్తివాసన్‌ (20) ప్లస్‌ టూ ముగించి రెండుసార్లు నీట్‌ రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో గత సెప్టెంబరులో జరిగిన నీట్‌కు కూడా హాజరయ్యాడు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్న కీర్తివాసన్‌.. మరికొద్ది రోజుల్లో పరీక్ష ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగాడు. ఆతర్వాత తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. తల్లి ఇంటికి చేరుకుని చూసేసరికి నోటి నుంచి నురగలు కక్కుతూ కీర్తివాసన్‌ కనిపించాడు. దీంతో అతడిని తొలుత పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి కోయంబత్తూరు తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు.

Updated Date - 2021-10-31T08:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising