ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు

ABN, First Publish Date - 2021-08-27T17:43:40+05:30

సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులను నియమిస్తూ గురువారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కర్ణాటకకు చెందిన ఇద్దరు సీనియర్లు ఉన్నారు. ప్రస్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులను నియమిస్తూ గురువారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కర్ణాటకకు చెందిన ఇద్దరు సీనియర్లు ఉన్నారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎస్‌ ఓకాతో పాటు సీనియర్‌ న్యాయమూర్తి బీవీ నాగరత్నలు ఉన్నారు. ఏఎస్‌ ఓకా రాష్ట్ర హైకోర్టు ఛీఫ్‌ జస్టి్‌సగా రెండేళ్ళ మూడునెలల పాటు వ్యవహరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడిన సందర్భం లో మాట్లాడుతూ 27నెలల పా టు ఇక్కడ పనిచేయడం ఆహ్లాదకర అనుభవం ఇచ్చిందన్నారు. కర్ణాటక న్యాయవాదుల పరిషత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 2025 మే నెలలో పదవీ విరమణ పొందనున్నారు. కాగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమింపబడిన బీవీ నాగరత్న సీనియారిటీ ప్రకారం ఎంపికయ్యారు. 1987 అక్టోబర్‌ 28న న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008లో రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. 2010 ఫిబ్రవరిలో రెగ్యులర్‌ నియమితులయ్యారు. గడిచిన 13ఏళ్ళలో మహత్తరమైన తీర్పులు ప్రకటించిన జడ్జిగా పేరొందారు. బీవీ నాగరత్న సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తిగా 2027లో సీనియారిటీ ప్రకారం ఎంపికయ్యే అవకాశం ఉంది. సుప్రీం కోర్టుకు ఆమె ప్రప్రథమ మహిళా న్యాయమూర్తి కానున్నారు. బీవీ నాగరత్న సుప్రీం కోర్టు మాజీ ముఖ్యన్యాయమూర్తి ఈఎస్‌ వెంకటరామయ్య కుమార్తె. 

Updated Date - 2021-08-27T17:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising