ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త న్యాయమూర్తుల జాబితాకు కేంద్రం ఓకే

ABN, First Publish Date - 2021-08-26T07:56:18+05:30

సుప్రీం కోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామకం విషయంలో న్యాయనిపుణులు ఊహించిన దానికంటే వేగంగా కేంద్రం స్పందించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలీజియం సిఫారసులకు ఆమోదం వారంలోనే నిర్ణయం

రాష్ట్రపతి నేడు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం

ఎంపికలో ప్రమాణాలకు పట్టం 

ఇంత త్వరగా కేంద్రం స్పందించడం ఇదే

సుప్రీంలో ఇక భర్తీ కావాల్సింది ఒకటే ఖాళీ


న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామకం విషయంలో న్యాయనిపుణులు ఊహించిన దానికంటే వేగంగా కేంద్రం స్పందించింది. ఈ నెల 17న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం 9 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాను కేంద్రం వారం రోజుల్లోనే ఆమోదించింది. ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం సాయంత్రానికే ఈ పేర్లను రాష్ట్రపతి భవన్‌కు పంపినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఈ న్యాయమూర్తుల నియామకాలను ఆమోదిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. గతంలో సుప్రీం కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం పక్కనపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్నిసార్లు ఆలస్యంగా ఆమోదించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ రమణ సారథ్యంలోని కొలిజీయం సూచించిన పేర్లకు కేంద్రం కొద్దిరోజుల్లోనే ఆమోద ముద్ర వేయ డం ప్రత్యేకత సంతరించుకుంది. జాబితాలోని కొందరి పేర్ల విషయంలో కేం ద్రం కొంత విముఖత వ్యక్తం చేసినప్పటికీ.. చివరకు అన్ని పేర్లనూ వారం తి రక్కముందే కేంద్రం ఆమోదించింది. ఇంత వేగంగా కొలీజియం సిఫారసులను కేంద్రం ఆమోదించిన దృష్టాంతాలు గతంలో లేవని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎంపికలో ప్రమాణాలకు పట్టం

కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తుల జాబితాను కేంద్రం సత్వరమే ఆమోదించడం వెనుక కారణాలు లేకపోలేదు. గతంలో 9మంది న్యాయమూర్తుల సుప్రీం బెంచ్‌ నెలకొల్పిన ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకొని న్యాయమూర్తుల ఎంపికలో కొలీజియం ప్రతిభకే పట్టం కట్టింది. ఎలాంటి విమర్శలకు తావులేని వారిని ఎంపిక చేసింది. 9 రాష్ట్రాలకు చెందిన వేర్వేరు న్యాయమూర్తులకు జాబితాలో స్థానం కల్పించడం మరో ప్రత్యేకత. అన్నిటికి మించి.. జస్టిస్‌ రమణ సారథ్యంలోని కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో ఒకేసారి ముగ్గురు మహిళా హైకోర్టు న్యాయమూర్తులు ఉండడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేగాక షెడ్యూల్డు కులాలు, బీసీ వర్గాలకు చెందిన న్యాయమూర్తులకు కూడా జాబితాలో అవకాశం కల్పించింది. దీంతో కొలీజియం సిఫారసులను వ్యతిరేకించడానికి కేంద్రానికి పెద్దగా ఆస్కారం లేకుండాపోయిందని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. కొలీజియం సిఫారసుల్లో... కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రం నాథ్‌, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.టి. రవికుమార్‌, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎం. సుంద్రేశ్‌, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేలా త్రివేది, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహ ఉన్న సంగతి తెలిసిందే. నరసింహను సిఫారసు చేయడం ద్వారా తెలుగువారికి కూడా సముచిత గుర్తింపు లభించింది. కాగా, కొత్త న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరుతుంది. 

Updated Date - 2021-08-26T07:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising