ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా టెలికాం కంపెనీపై అమెరికా వేటు

ABN, First Publish Date - 2021-10-28T00:12:24+05:30

చైనా టెలికాం (అమెరికాస్) కార్పొరేషన్ అమెరికన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : చైనా టెలికాం (అమెరికాస్) కార్పొరేషన్ అమెరికన్ మార్కెట్ నుంచి బహిష్కరణకు గురైంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో దేశ భద్రతకు, చట్టాల అమలుకు  ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ ఈ కంపెనీ కార్యకలాపాలను 60 రోజుల్లోగా నిలిపేయాలని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మంగళవారం ఆదేశించింది. 


చైనా టెలికాం (అమెరికాస్) కార్పొరేషన్ చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని మూడు పెద్ద టెలికాం సంస్థల్లో ఒకటి. అమెరికాలో ఈ కంపెనీ అందిస్తున్న డొమెస్టిక్ ఇంటర్‌స్టేట్, ఇంటర్నేషనల్ సర్వీస్‌ను  60 రోజుల్లోగా నిలిపేయాలని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మంగళవారం ఓ ఆర్డర్‌ను జారీ చేసింది. చైనా ప్రభుత్వ యాజమాన్యంలో ఈ కంపెనీ నడుస్తోందని, దీనిని చైనా ప్రభుత్వమే నియంత్రిస్తోందని, అందువల్ల అమెరికా దేశ భద్రత, చట్టాల అమలుకు హాని జరిగే అవకాశం ఉందని తెలిపింది. చైనా ప్రభుత్వం ఈ కంపెనీ ద్వారా అమెరికాలో గూఢచర్యానికి, ఇతర హానికర కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొంది.


డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ కూడా దీనిని కొనసాగిస్తున్నారు. 


Updated Date - 2021-10-28T00:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising