ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు మహిళా రైతుల పేరిట రూ.5 కోట్ల రుణం..!

ABN, First Publish Date - 2021-08-21T17:28:29+05:30

‘మీకు రూ.5కోట్ల అప్పు ఉంది..మీరు చెల్లించనందున మీ ఆ స్తులు జప్తు చేస్తున్నాం’ అనగానే ఆ మహిళలు అవాక్క య్యారు. కారణమేమంటే వారసలు అప్పే తీసుకోలేదు మరి. బ్యాంకు నుం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   - వారికి  తెలియకుండానే మంజూరు

   - ఆస్తుల జప్తునకు బ్యాంకు అధికారులు రావడంతో బాధితులు షాక్‌


బెంగళూరు: ‘మీకు రూ.5కోట్ల అప్పు ఉంది..మీరు చెల్లించనందున మీ ఆ స్తులు జప్తు చేస్తున్నాం’ అనగానే ఆ మహిళలు అవాక్క య్యారు. కారణమేమంటే వారసలు అప్పే తీసుకోలేదు మరి. బ్యాంకు నుంచి రుణం పొందాలంటే సవాలక్ష నిబంధనలు ఉంటాయి. భూములకు సంబంధిం చి తా కట్టు పెట్టుకోవడంతోపాటు రుణం ఎందుకు తీసుకుంటున్నారనేది పలుమార్లు పరిశీలించి మంజూరు చేస్తుంటారు. ఇవన్నీ సామాన్యులకు మాత్రమే అనిపిస్తోంది. కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలో ఇరువురు మహిళల పేరిట రూ.ఐదు కోట్ల రుణం ఉందనే విషయం ఏకంగా బ్యాంకర్లు ఆస్తుల జప్తు చే సేందుకు వచ్చేదాకా తెలియలేదు. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా దాగినకట్టె గ్రామానికి చెందిన గీతమ్మ, సావిత్రమ్మ అక్కాచెల్లెళ్లు. 2014లో వి తంతు పింఛన్‌ మంజూరు చేయిస్తానని అప్పటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మేనేజర్‌ శోభ నమ్మించారు. ఇరువురి పేరిట బ్యాంకు ఖాతాలు చేయించారు. ఆ తర్వాత వారికి తెలియకుండానే ఇరువురి పేరిట ఏకంగా ఐదుకోట్ల రుణం మంజూరు చేసుకున్నారు. గురువారం డీసీసీ బ్యాంకు అధికారులు ఏకం గా ఆస్తుల జప్తుచేసేందుకు గ్రామానికి రాగా తామెందుకు అప్పు తీసుకుంటామని నిలదీశారు. మీ ఇరువురి పేరిట ఏడేళ్ళకిందటే రుణం మంజూరయ్యిందని అందుకు సంబంధించిన వివరాలను బ్యాంకర్లు చూ పారు. తాము అంతగా అప్పు చేసేవారం కాదని అంత అవసరం కూడా లేదని తేల్చి చెప్పారు. 2014లో వితంతు పింఛను చేయిస్తానని శోభ నమ్మించారని చెప్పుకొచ్చారు. ఈమేరకు దావణగెరె పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఐదుకోట్ల రుణం తీసుకోలేదని అంత సొమ్ము అవసరం లేదన్నారు. బ్యాంకు మేనేజర్‌ శోభాపై విచారణ జరిపే అవకాశం ఉంది. బ్యాంకు అధికారులు తాత్కాలికంగా జప్తు ప్రక్రియను నిలిపివేశారు.

Updated Date - 2021-08-21T17:28:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising