ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కన్నుమూత

ABN, First Publish Date - 2021-08-22T03:29:38+05:30

యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కన్నుమూత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్: మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో లక్నో సంజయ్ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ఆసుప‌త్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేషన్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆయన శనివారం సాయంత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. 


కాగా జనవరి 5, 1932లో ఆయన  జన్మించారు. అత్రౌలి నియోజకవర్గం నుంచి తొలిసారి కల్యాణ్ సింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1967 నుంచి 2002 మధ్యకాలంలో మొత్తం పది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కల్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో కల్యాణ్ సింగ్ తన సీఎం పదవికి  రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో యూపీలో రాష్ట్రపతి పాలన విధించారు. 1993 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి కల్యాణ్ సింగ్ విజయం సాధించారు. రెండు సార్లు యూపీ సీఎంగా, మరో రెండు సార్లు ఎంపీగా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కూడా ఆయన పని చేశారు. 


కల్యాణ్ సింగ్ మృతికి ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాతో పాటు యూపీ సీఎం యోగీ‌, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. 

Updated Date - 2021-08-22T03:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising