ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బిగ్‌‌బాస్‌లా ఓట్లేస్తారని అనుకుంటున్నారా!’

ABN, First Publish Date - 2021-01-23T16:02:07+05:30

అందరూ ఓట్లేసేందుకు కమల్‌హాసన్‌ అసెంబ్లీ ఎన్నికలను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : అందరూ ఓట్లేసేందుకు కమల్‌హాసన్‌ అసెంబ్లీ ఎన్నికలను బిస్‌బాస్‌ రియాల్టీ షోగా భావిస్తున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగై సెల్వన్‌ ఎద్దేవా చేశారు. కోవిల్‌పట్టిలో శుక్రవారం నిర్వహించిన ఎంజీఆర్‌ 104వ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీ నుంచి వైదొలిగిన నేతలు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోక అమోమయంలో ఉన్నారన్నారు. పాఠశాల అద్దె కూడా చెల్లించని ఓ వ్యక్తి (రజనీకాంత్‌) ప్రస్తుతం పార్టీ వద్దు అని పేర్కొన్నారన్నారు.


అలాగే, ఆర్‌కే నగర్‌లో ఓటుకు రూ.5 వేలు ఇస్తామని చెప్పి  గెలిచిన అనంతరం ప్రజలను మర్చిపోయిన వ్యక్తి టీటీవీ దినకరన్‌ అన్నారు. నటన ద్వారా ప్రజలను మెప్పించవచ్చని, అందరూ ఓట్లు వేయడానికి అసెంబ్లీ ఎన్నికలను కూడా బిగ్‌ బాస్‌ రియాల్టీ షో ఓట్లుగా కమల్‌హాసన్‌ భావిస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఆ షోలో శివాని, రమ్యపాండియన్‌కు వచ్చిన ఓట్లు కూడా కమల్‌హాసన్‌ వచ్చే అవకాశం లేదన్నారు. ఎంకే స్టాలిన్‌ను కరోనా వైరస్‌గా, ఉదయనిధి స్టాలిన్‌ను కరోనా స్ట్రెయిన్‌గా వైగై సెల్వన్‌ అభివర్ణించారు.

Updated Date - 2021-01-23T16:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising