బెంగాల్ ఏజీ కిశోర్ దత్త రాజీనామా
ABN, First Publish Date - 2021-09-14T22:07:36+05:30
మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి అడ్వకేట్ జనరల్‌గా ఆనింద్య మిత్ర బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం బిమాల్ ఛటర్జీ, జయంత మిత్ర కొనసాగారు. తాజాగా దత్త రాజీనామాతో మమతా ప్రభుత్వంలో ఐదవ వ్యక్తి ఏజీగా అవకాశం లభించింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అడ్వొకేట్ జనరల్ కిషోర్ దత్త మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. రాజీనామా లేఖను గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌కు పంపగా ఆయన వెంటనే ఆమోదం తెలిపినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అడ్వకేట్ జనరల్‌గా 2017 ఫిబ్రవరిలో దత్త బాధ్యతలు తీసుకున్నారు. మమత ప్రభుత్వంలో ఈయన నాలుగవ అడ్వకేట్ జనరల్. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి అడ్వకేట్ జనరల్‌గా ఆనింద్య మిత్ర బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం బిమాల్ ఛటర్జీ, జయంత మిత్ర కొనసాగారు. తాజాగా దత్త రాజీనామాతో మమతా ప్రభుత్వంలో ఐదవ వ్యక్తి ఏజీగా అవకాశం లభించింది.
Updated Date - 2021-09-14T22:07:36+05:30 IST