ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపవాసంలో కాఫీ?

ABN, First Publish Date - 2021-08-10T05:34:49+05:30

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ పాటించే వాళ్లకు కాఫీ గురించి సందేహాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఉదయం కాఫీ తాగనిదే రోజు మొదలవని వాళ్లకు ఉపవాసంతో చెప్పలేనంత ఇబ్బంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ పాటించే వాళ్లకు కాఫీ గురించి సందేహాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఉదయం కాఫీ తాగనిదే రోజు మొదలవని వాళ్లకు ఉపవాసంతో చెప్పలేనంత ఇబ్బంది. ఇలాంటివాళ్లు ఏం చేయవచ్చంటే....


16 గంటల ఉపవాసంతో కూడుకుని ఉండే ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌లో ఏడు గంటల ఆహార వ్యవధి ఉంటుంది. ఆ సమయంలో మినహా, మిగతా సమయాల్లో ఆహారం జోలికి వెళ్లకూడదు. అయితే ఉపవాసంలో ఉన్నంత మాత్రాన కాఫీ లాంటి పానీయాలు తాగకూడదనే నియమం లేదు. వెసులుబాటు సమయంతో ప్రమేయం లేకుండా కాఫీ, గ్రీన్‌ టీ లాంటివి తాగవచ్చు. అయితే వాటిలో చక్కెర, పాలు, తేనెలు కలపకూడదు. చక్కెరకు బదులుగా ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్లు కూడా వాడుకోకూడదు. ఇవి మేలు కంటే ఎక్కువ కీడు చేస్తాయి. తీపి తినాలనే కోరికను పెంచుతాయి. కాబట్టి కృత్రిమ చక్కెర జోడించకుండా కాఫీ డికాక్షన్‌ లేదా తేనె కలపని గ్రీన్‌ టీ, నిమ్మరసం లాంటివి తాగవచ్చు. కాఫీతో ఉన్న మరొక ప్రయోజనం ఆకలి అదుపులోకి రావడం. కాబట్టి ఉదయం వేళ ఉపవాసంతో కూడిన ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేస్తున్నవాళ్లు నిరభ్యంతరంగా కాఫీ డికాక్షన్‌ తాగవచ్చు.

Updated Date - 2021-08-10T05:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising