వెనిగర్‌తో దుస్తులు శుభ్రం!
ABN, First Publish Date - 2021-01-28T07:42:14+05:30
వెనిగర్ సువాసనలు చిందించకపోయినా దుస్తులను శుభ్రంగా, మెత్తగా ఉంచుతుంది.
వెనిగర్ సువాసనలు చిందించకపోయినా దుస్తులను శుభ్రంగా, మెత్తగా ఉంచుతుంది.
ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ ఆనవాళ్లు దుస్తులకు అంటుకుని ఉంటే కొందరికి ఇరిటేషన్ వస్తుంది. వెనిగర్‌తో ఇలాంటి సమస్యలు తక్కువ. సున్నితమైన చర్మం ఉన్నవారికి వెనిగర్ వాడకం బెస్ట్.
వెనిగర్ మల్టీటాస్కర్. ఇది బట్టలను సాఫ్ట్‌గా ఉంచడంతోపాటు వాషింగ్ మిషిన్‌లో సున్నం ప్రమాణం పెరగడాన్ని తగ్గిస్తుంది. దీంతో వాషింగ్ మెషీన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.
చలికాలంలో దుస్తులు స్టాటిక్‌గా ఉంటాయి. అందుకే దుస్తుల లాండ్రీలో వెనిగర్‌ను ఉపయోగిస్తే అందులోని ఎసిడిటీ కంటెంట్ బట్టల్లోని స్టాటిక్ స్వభావాన్ని పోగొడుతుంది.
వెనిగర్ దుస్తులను మెత్తగా ఉంచడమే కాదు వాటి రంగును కూడా పోగొట్టదు.
వెనిగర్ సువాసన అంత బాగుండదు కానీ దుస్తులు పూర్తిగా పొడారిన తర్వాత వెనిగర్‌కుండే వాసన బట్టల్లో ఉండదు. అయితే వెనిగర్‌ని అతిగా వాడకూడదు. మీరు వాడేది ఉప్పు నీళ్లు అయితే ఒక కాపీ కప్పు వెనిగర్‌ని ఉపయోగించాలి. మంచినీళ్లు ఉపయోగించేటప్పుడు మాత్రం చిన్న టేబుల్ స్పూన్ వెనిగర్ వాడితే చాలు.
Updated Date - 2021-01-28T07:42:14+05:30 IST