ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఏడాది మొదటి రోజు ఇలా చేస్తే..!

ABN, First Publish Date - 2022-01-01T04:49:32+05:30

కొత్త ఏడాదంతా మంచి జరగాలని, జీవితంలో పైకి ఎదగాలని అందరూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త ఏడాదంతా మంచి జరగాలని, జీవితంలో పైకి ఎదగాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం జనవరి1న రకరకాల పనులు చేస్తుంటారు. ఒక్కోదేశంలో ఒక్కో సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. అలా చేయడంవల్ల కలిసొస్తుందని వాళ్ల నమ్మకం. ఆ విశేషాలు ఇవి...


 మెక్సికో, నెదర్లాండ్స్‌ ప్రజలు కొత్త ఏడాది రోజున రింగ్‌ షేష్‌లో ఉన్న పాస్ట్రీలు తింటారు. ఫిలిప్పీన్స్‌లో 12 రకాల వంటలతో రాత్రి విందు చేసుకుంటారు. 

 స్పెయిన్‌లో స్థానిక చర్చిలలో పన్నెండు సార్లు గంట మోగిస్తారు. గంట మోగినప్పుడు ఒక్కో ద్రాక్షపండు చొప్పున పన్నెండు ద్రాక్షపండ్లు తింటారు. ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుందని వాళ్లు విశ్వసిస్తారు.

 ఇక డెన్మార్క్‌లో స్నేహితుల ఇళ్ల ముందు పింగాణి ప్లేట్లు, వస్తువులు పగలగొడతారు. ఇలా చేస్తే చెడు దూరమవుతుందని నమ్మకం.

 జపాన్‌లో 108 సార్లు గంట మోగిస్తారు. దీనివల్ల కొత్త ఏడాది అదృష్టం కలసి వస్తుందని వాళ్ల విశ్వాసం. చైనీయులు పొడవైన నూడుల్స్‌ తింటారు. 

 గ్రీసు దేశంలో ప్రజలు ప్రధాన ద్వారం దగ్గర ఉల్లిపాయను వేలాడదీస్తారు. అంతేకాకుండా ఉల్లిపాయతో నెత్తిమీద కొట్టడం ద్వారా పిల్లలను జనవరి 1న నిద్ర లేపుతారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. 


Updated Date - 2022-01-01T04:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising