ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సందర్భానికి సరిజోళ్లు

ABN, First Publish Date - 2021-01-13T06:01:08+05:30

సందర్భానికి సరిజోళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీలు, ఫంక్షన్లలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటాం. అందుకు తగ్గట్టే ఫ్యాషన్‌గా కనిపించే డ్రెస్‌ వేసుకుంటాం.  ఫ్యాషన్‌గా, సౌకర్యంగా ఉండే షూ లేదా చెప్పులు వేసుకుంటాం. ప్రస్తుతం మార్కెట్లో క్యాజువల్‌ వేర్‌ మీదకైనా, ఫార్మల్‌ డ్రెస్‌ మీదకైనా చక్కగా నప్పే స్నీకర్స్‌ లభిస్తున్నాయి. వీటిలో ఏ సందర్భానికి ఎలాంటివి ఎంచుకోవాలో చెబుతున్నారు బాటా ఇండియా లిమిటెడ్‌ ఛీఫ్‌ కలెక్షన్‌ ఆఫీసర్‌ మట్టియో లాంబర్ట్‌. 




ఫ్యామిలీ పిక్నిక్‌

సరదాగా కుటుంబంతో గడిపే సమయం కాబట్టి ఎరుపు లేదా నారింజ రంగులో ఉండే పొల్కా పాట్‌ డ్రెస్‌ ఎంచుకోవాలి. ఈ డ్రెస్‌ మీదకు తెల్లని స్నీకర్స్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి.




సండే సందడికి


ఆదివారం అలా స్నేహితులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేసేందుకు బయటకు వెళ్లేటప్పుడు క్రీమ్‌ కలర్‌ ఆఫ్‌ షోల్డర్‌ డ్రెస్‌, వాటికి మ్యాచింగ్‌గా మెటాలిక్‌ స్నీకర్స్‌ బాగుంటాయి. 





షాపింగ్‌ వేళలో

 పండుగ షాపింగ్‌ కోసం వెళ్లినప్పుడు ఎక్కువ మంది ఉన్నారనుకోండి క్యూలో ఒక్కోసారి ఎక్కువ సమయం నిల్చోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు సౌకర్యంగా ఉండే జాగర్స్‌, లేత రంగు టీ షర్ట్‌ వేసుకోవాలి. నలుపు స్నీకర్స్‌ ఎంచుకోవాలి. దాంతో ఎక్కువ సమయం నిల్చోగలుగుతారు. ఫ్యాషన్‌గానూ కనిపిస్తారు. 





పార్టీ, ఫంక్షన్‌

 ఫ్రెండ్స్‌తో పార్టీకి వెళ్లాల్సి వచ్చినప్పుడు తళుక్కుమనే నియాన్‌ స్నీకర్స్‌ మంచి ఎంపిక. నలుపు డ్రెస్‌, నియాన్‌ స్నీకర్స్‌ కాంబినేషన్‌ అదిరిపోయే లుక్‌నిస్తుంది. 


Updated Date - 2021-01-13T06:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising