ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా... హుషారుగా!

ABN, First Publish Date - 2021-02-24T06:57:05+05:30

సంగీతం వింటున్నప్పుడు కలిగే ఉత్తేజమే వేరు. అందుకే ఏదైనా పని చేస్తున్నా, కారులో వెళుతున్నా పాటలు వింటుంటాం. సంగీతం వినకుండా డ్రైవింగ్‌ చేయడం అసాధ్యం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగీతం వింటున్నప్పుడు కలిగే ఉత్తేజమే వేరు. అందుకే ఏదైనా పని చేస్తున్నా, కారులో వెళుతున్నా పాటలు వింటుంటాం.  సంగీతం వినకుండా డ్రైవింగ్‌ చేయడం అసాధ్యం. అయితే కారులో పాటలు వినడం వినోదాన్ని ఇవ్వడంతో పాటు ఏకాగ్రతపై ప్రభావం చూపుతుందని, దుందుడుకు స్వభావానికి కారణం అవుతుందని, ప్రమాద సంకేతాలను అంచనా వేయలేకపోతామని అంటున్నారు యంగ్‌ డ్రైవర్స్‌. ఇజ్రాయేల్‌ దేశంలోని బెన్‌ గురియన్‌ యూనివర్సిటీ పరిశోధకులు ‘సైకాలజీ, మ్యూజిక్‌, మైండ్‌ అండ్‌ బ్రెయిన్‌’ జర్నర్‌లో ప్రచురించిన అధ్యయనం ఏం చెబుతుందంటే....


‘‘18 నుంచి 29 ఏళ్ల మధ్యనున్న యువతకు కారులో సంగీతం వినోదం కోసమే కాదు. సంగీతం అనేది వారిలో భాగం. అయితే వివిధ రకాల ట్యూన్స్‌ ఏకాగ్రత మీద ఎలా ప్రభావం చూపుతాయి, వారిని ఎలా దుందుడుకుగా మారుస్తాయి, తప్పిదాలు చేసేందుకు కారణవుతాయి వంటి ప్రశ్నలను మేము అడగలేదు’’ అంటున్నారు మ్యూజిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ ప్రొఫెసర్‌ వారెన్‌ బ్రాడ్‌స్కి. అధ్యయనంలో భాగంగా వాహనదారులు డ్రైవింగ్‌ చేసేటప్పుడు సంగీతాన్ని ఎలా ఆస్వాదిస్తారో తెలుసుకునేందుకు 140 మంది యంగ్‌స్టర్స్‌ను 67 ప్రశ్నలు అడిగారు. వీరిలో 80శాతం మంది ‘డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు సంగీతం వినకుండా ట్రాఫిక్‌ను గమనించడం, రోడ్డు పరిస్థితి అర్థం చేసుకోవడం ఒక్కోసారి ఇబ్బందికరం అని, కొన్నిసార్లు అసాధ్యం అని చెప్పారు. 97 శాతం మంది లాంగ్‌ ట్రిప్‌లో అన్నిరకాల పాటలు విన్నామని, ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఫాస్ట్‌బీట్‌ సంగీతం వింటామని 67శాతం మంది, హాలిడే లేదా అవుటింగ్‌కు వెళ్లే సమయంలో ‘ఉత్తేజాన్నిచ్చే పాటలు వింటామని 76 శాతం మంది చెప్పారు.

Updated Date - 2021-02-24T06:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising