ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శూన్యం

ABN, First Publish Date - 2021-05-19T05:30:00+05:30

కాఫీ షాప్‌లో విశ్వ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అంతలో ఓ అమ్మాయి... కలర్‌ఫుల్‌ చీరలో... ఎంటర్‌ అవుతుంది. ఆమెను చూడగానే విశ్వ గుండె జారిపోతుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాఫీ షాప్‌లో విశ్వ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అంతలో ఓ అమ్మాయి... కలర్‌ఫుల్‌ చీరలో... ఎంటర్‌ అవుతుంది. ఆమెను చూడగానే విశ్వ గుండె జారిపోతుంది. అక్కడున్న ఓ కాగితంపై ‘ఐ లవ్‌ యూ’ అని రాసేస్తాడు. వెయిటర్‌కు ఇచ్చి ఆ కాగితాన్ని ఆమెకు పంపిస్తాడు. అందులో ఏం రాసుందో చూడదు తను. దాని వెనకాల ఓ అభ్యంతరకర ఫొటో చూసి ఆమెకు చిర్రెత్తుకొస్తుంది. ఇలాంటివి ఏమిటిక్కడంటూ వెయిటర్‌పై కసురుకుంటుంది. ఇంతలో విశ్వ వెళ్లి ఆమెకు అసలు విషయం చెబుతాడు. బొమ్మ కాదు... వెనకాల రాసింది చదవమంటాడు. అది చూడగానే ఆమె చల్లబడుతుంది. ‘రాసేదేదో మంచి పేపర్‌లో రాయచ్చుగా! ఇలా ఎందుకు’ అని అడుగుతుంది తను! ‘నా మనసులో మాట చెప్పడానికి ఆ క్షణంలో నాకు కనిపించింది ఈ పేపరే’ అంటాడు విశ్వ. ‘ఇంట్రస్టింగ్‌... వితిన్‌ షార్ట్‌ టైమ్‌లో ఫీల్‌ ఎలా?’... సందేహంగా అడుగుతుంది తను. ‘కళ్లకు నచ్చినమ్మాయి ఎదురుగా కూర్చొన్నప్పుడే కదండీ... మ్యాజిక్‌ జరిగేది’! ‘అయినా ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉండగా నన్ను చూసి ఆ మ్యాజిక్‌ ఎందుకు జరిగిందో తెలుసుకోవచ్చా’... ఆ యువతి ప్రశ్న. ‘మనం ఆకాశాన్ని చూసిన ప్రతిసారీ నక్షత్రాలే ఎక్కువ కనిపిస్తాయి. కానీ మనం చందమామను మాత్రమే ఇష్టపడతాం’ అని విశ్వ అంటే... ‘పర్లేదు.. బానే మాట్లాడుతున్నావ్‌. ఇంతకీ ఏంచేస్తుంటావ్‌’... తను అడుగుతుంది. ‘నేనొక రచయితనులెండి. ఏదో కాఫీ తాగుదామని వచ్చా. కానీ ఇక్కడకు వచ్చాకే అర్థమైంది... రచయితలు ప్రకృతిని, అందాన్ని అమ్మాయిలతో ఎందుకు వర్ణిస్తారో’ అంటాడు అతడు. 


ఇద్దరి మధ్యా కాఫీ షాప్‌లో సంభాషణ ఎక్కడికో వెళ్లిపోతుంది. ప్రేమను వర్ణించడానికి అక్షరాలు లేవంటాడు అతడు. అమ్మాయికి స్వేచ్ఛ కలలో తప్ప బయట భూతద్దం పెట్టి వెతికినా లేదంటుంది ఆమె. ఆడ- మగ అనే తేడా అభిప్రాయాల్లో తప్ప ఆలోచనల్లో ఉండకూడదంటాడు విశ్వ. ‘మీ మాటలకు అర్థాలు తెలియాలంటే డిక్షనరీ ఉండాలంటుంది’ తను. ‘నవ్య నా జీవితంలోకి వచ్చాక ఆమెను వర్ణించడానికి అక్షరాల కోసం వెతుకుతూ ఇలా రచయితనయ్యా’నంటాడు విశ్వ. ఇప్పుడు అతడికి ఆమె ఒక జ్ఞాపకం. జీవన గమనంలో ఆ జ్ఞాపకం నిదానంగా మరుగున పడిందని తనను తాను ఆవిష్కరిస్తాడు. ‘సరే... నేను వెళతాను. ఇప్పటికే ఆలస్యమైంది’ అంటుంది ఆమె. ‘బహుశా మీ నంబర్‌ ఇవ్వడం మరిచిపోయినట్టున్నారు’ అంటూ పరోక్షంగా ఆమె ఫోన్‌ నంబర్‌ అడుగుతాడు విశ్వ. ‘మీరింత తెలివైన వారు కదా... ఇప్పటి వరకు మనం మాట్లాడిన మాటలను గుర్తు చేసుకొంటే అందులోనే నా నంబర్‌ దొరుకుతుంది. కనుక్కొంటే మళ్లీ కలుద్దాం’ అంటూ వెళ్లిపోతుంది తను. మరి విశ్వ ఆ నంబర్‌ను డీకోడ్‌ చేస్తాడా? ఆమెను కలుస్తాడా? తెలియాలంటే ‘శూన్యం’ లఘుచిత్రం చూడాలి. గౌరీనాయుడు, నిత్యశ్రీ నటనలో పెద్దగా మెప్పించకపోయినా, ఇరువురి పాత్రల సంభాషణ ఆసక్తిగా సాగుతుంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ షార్ట్‌ ఫిలిమ్‌ను ఇప్పటికి 2.83 లక్షలమంది వీక్షించారు. వీలైతే మీరూ ఓసారి చూడండి. 

Updated Date - 2021-05-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising