ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లఘుచిత్రంతో ఆస్కార్ బరిలో...

ABN, First Publish Date - 2021-02-03T05:30:00+05:30

‘‘నేను బాగా ఆలోచించాకే ఏదైనా ప్రాజెక్ట్‌కు ఓకే చేస్తాను. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచస్థాయి సినిమాలు చూశాక ఈ నిర్ణయం తీసుకున్నాను. కొత్త కథల పరంగా చూస్తే వెబ్‌ సినిమా ఒక విప్లవం. కొన్ని వెబ్‌ సిరీస్‌లు ఎంతో నాణ్యతతో ఉంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘నేను బాగా ఆలోచించాకే ఏదైనా ప్రాజెక్ట్‌కు ఓకే చేస్తాను. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచస్థాయి సినిమాలు చూశాక ఈ నిర్ణయం తీసుకున్నాను. కొత్త కథల పరంగా చూస్తే వెబ్‌ సినిమా ఒక విప్లవం. కొన్ని వెబ్‌ సిరీస్‌లు ఎంతో నాణ్యతతో ఉంటున్నాయి. అయితే ప్రపంచ స్థాయికి చేరుకోవాలంటే మరింత కష్టపడాలి. 


ఒక షార్ట్‌ ఫిలిమ్‌తో వేలకొద్దీ ప్రశంసలు అందుకున్న నటి సయానీ గుప్త. రెండేళ్ల క్రితం ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘షేమ్‌లెస్‌’ లఘుచిత్రం లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ఫిలిమ్‌ విభాగంలో ఈ ఏడాది ఆస్కార్స్‌కు నామినేట్‌ అయింది. తన అభినయంతో బాలీవుడ్‌ ప్రముఖుల అభినందనలు అందుకుంటున్న సయానీ వెబ్‌ సినిమా, తన సినిమాల గురించి ఏం చెబుతున్నారంటే... 


కల్కి కొచ్లిన్‌తో కలిసి నటించిన ‘మార్గరిటీ విత్‌ ఏ స్ట్రా’ (2014)సినిమాలో సయానీ గుప్త అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. సరిగ్గా ఏడేళ్ల తరువాత చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటిగా ఎదిగారు సయానీ. రెండేళ్ల క్రితం ఆమె నటించిన ‘షేమ్‌లెస్‌’ లఘుచిత్రం తాజాగా ఆస్కార్‌ బరిలో నిలిచింది. కీత్‌ జేమ్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సయానీ డెలివరీ గాళ్‌గా నటించారు. దిగజారిపోతున్న మానవ విలువలు, సమాజంలో నేటికీ ఉన్న అంతరాలను పదిహేను నిమిషాల నిడివిలో చాలా చక్కగా ఆవిష్కరించారు కీత్‌ జేమ్స్‌. ‘షేమ్‌లెస్‌’ చిత్రీకరణ సమయంలోనే అనూష బోస్‌ డైరెక్షన్‌లో ‘షేమ్‌’ అనే చిత్రంలో నటించిన సయానీ తన సినిమా ఆస్కార్‌ బరిలో నిలుస్తుందని కలలో కూడా ఊహించలేదు. ‘‘ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్నప్పుడు అది ఎంత సక్సెస్‌ అవుతుందో ఉహించం.


కీమ్‌ జేమ్స్‌, హుస్సేన్‌ నాకు ‘షేమ్‌లెస్‌’ కథ వినిపించగానే బాగా నచ్చింది. ముఖ్యంగా హుస్సేన్‌ను నేను గుడ్డిగా నమ్ముతాను. ఆ సినిమాలో నా పాత్ర నచ్చగానే వెంటనే ఓకే చెప్పేశాను. ఇప్పుడిప్పుడే వెబ్‌ సినిమాకు ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే వాటి నాణ్యత గురించి నేను ఏమీ చెప్పలేను’’ అని వివరిస్తారు సయానీ.  


ప్రపంచస్థాయిని అందుకోవాలి 

ఓపైపు తన లఘుచిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచిన ఆనందం, మరోవైపు బాలీవుడ్‌ ప్రముఖుల ప్రశంసలతో పట్టలేనంత సంతోషంలో ఉన్నారు సయానీ. ‘‘నేను బాగా ఆలోచించాకే ఏదైనా ప్రాజెక్ట్‌కు ఓకే చెబుతాను. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచస్థాయి సినిమాలు చూశాక ఆ నిర్ణయం తీసుకున్నాను. కొత్త కథల పరంగా చూస్తే వెబ్‌ సినిమా ఒక విప్లవం. కొన్ని వెబ్‌ సిరీస్‌లు ఎంతో నాణ్యతతో ఉంటున్నాయి. అయితే ప్రపంచ స్థాయికి చేరుకోవాలంటే మరింత కష్టపడాలి. మన సినిమాలు ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్‌ అవడమే కాదు అవార్డులు కూడా సాధిస్తున్నాయి. ‘ఢిల్లీ క్రైమ్స్‌’ సినిమాకు ఎమ్మీ అవార్డ్‌ రావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే నేను నటించిన ‘ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌’ టీవీ సిరీస్‌ అనేక బహుమతులు గెలుచుకుంది’’ అంటున్న సయానీ లాక్‌డౌన్‌ సమయంలో మ్యాగజైన్స్‌కు ఎడిటోరియల్‌ షూట్స్‌, నెట్‌ఫ్లిక్స్‌ సినిమా షూటింగ్‌లతో బిజీగా గడిపారు. అంతేకాదు ఒక బ్రిటీష్‌ షో కూడా చేశారు. ఇంటివద్ద ఖాళీగా కూర్చోకుండా జుట్టు, మేకప్‌ మీద దృష్టిపెట్టారు. తనకు ఎంతో ఇష్టమైన కుకింగ్‌లో కొత్త ప్రయోగాలు చేశారు. ఇండియన్‌, కొరియన్‌ వంటకాలు ప్రయత్నించారు. ‘‘ఇప్పుడు నేను క్షణం తీరిక లేకుండా ఉన్నాను. లాక్‌డౌన్‌ నాకు ఎంతో ఉపయోగపడింది. ఈ ఏడెనిమిది నెలల్లో నేను ఎంతో బీజీగా ఉన్నాను’’ అంటున్న సయానీ గుప్త మరిన్ని మంచి ప్రాజెక్టులకు రూపం ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. 


సయానీ సినీ ప్రయాణం ఆసక్తికరంగా మొదలైంది. గాయకుడు, సంగీతకారుడు అయిన తండ్రి కమల్‌ గుప్తా స్ఫూర్తితో నటి అవ్వాలనుకున్నారు. తన తన కలను నిజం చేసుకునేందుకు మార్కెటింగ్‌ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ క్రమంలోనే ‘ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌’, ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ వంటి టీవీ సిరీ్‌సలతో వెబ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా వెండితెరపై విభిన్నమైన పాత్ర ల్లో మెప్పించి, తక్కువ కాలంలోనే తానేంటో నిరూపించుకున్నారామె. 

Updated Date - 2021-02-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising