ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరిపించే రంగులు

ABN, First Publish Date - 2021-01-06T05:30:00+05:30

చూడగానే కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. ఎంతమందిలో ఉన్నా కొట్టచ్చినట్టు కనిపిస్తాయి. చూపు తిప్పుకోలేము...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చూడగానే కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. ఎంతమందిలో ఉన్నా కొట్టచ్చినట్టు కనిపిస్తాయి. చూపు తిప్పుకోలేము... అలాగని అదేపనిగా చూడనూలేము. అదే నియాన్‌ కలర్‌ డ్రెస్సుల్లో ఉన్న ప్రత్యేకత. హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాటి టాలీవుడ్‌ వరకు ఈ స్టయిల్‌ ఎవర్‌గ్రీన్‌. తారలు... తెర వెనుక సాంకేతిక నిపుణులు... నియాన్‌ రంగుల్లో తళుక్కుమంటున్నారు. ఇప్పుడిప్పుడే సాధారణ పార్టీల్లో కూడా నియాన్‌ మెరుపులు మెరుస్తున్నాయి.


 నియాన్‌లో పసుపు, గులాబీ, నారింజ, ఆకుపచ్చ, నీలం వర్ణాలున్నాయి. వీటిల్లో పసుపు, గులాబీ కాంబినేషన్‌ అంతా ఇష్టపడే కామన్‌ స్టయిల్‌. అయితే ఈ మధ్య నారింజ, ఆకుపచ్చ నియాన్‌ కలర్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. టీషర్ట్స్‌, స్పోర్ట్స్‌వేర్‌, క్రాప్‌టాప్స్‌, జాకెట్స్‌కు నియాన్‌ కలర్స్‌ వాడుతుంటారు.


 హాలీవుడ్‌ అందాల రాసి జెన్నిఫర్‌ లోపెజ్‌, బాలీవుడ్‌ ట్రెండీ హీరో రణవీర్‌సింగ్‌ తదితరులు ఈ ట్రెండ్‌ను మరింతగా జనాల్లోకి  తీసుకువెళ్లారు. ఇక టాప్‌ టు బాటమ్‌ ఆహార్యం వినూత్నంగా ఉండాలనుకొనే తారలు నియాన్‌ హెయిర్‌ స్టయిల్స్‌ కూడా ఉపయోగిస్తున్నారు.


 పాప్‌ గాయకుల్లో ఈ ట్రెండ్‌ విపరీతంగా కనిపిస్తోంది. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉండాలనుకొంటే మీరూ ఓసారి ‘నియాన్‌ టచ్‌’ ఇచ్చి చూడండి. 


Updated Date - 2021-01-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising