ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలపు ప్రయాణంలో చేయకూడనివి!

ABN, First Publish Date - 2021-03-10T05:38:30+05:30

యవ్వనంలో ప్రేమ తెలియకుండానే పుడుతుంది. ఆ పరవశం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. తొలినాళ్లలో ఉండే భావోద్వేగాలు ప్రేమలోని మజాలో ఒలలాడిస్తాయి. అయితే కొన్నిసార్లు కొత్తజంటలు లేనిపోని పంతాలకు పోయి చేజేతులా తమ బంధాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యవ్వనంలో ప్రేమ తెలియకుండానే పుడుతుంది. ఆ పరవశం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. తొలినాళ్లలో ఉండే భావోద్వేగాలు ప్రేమలోని మజాలో ఒలలాడిస్తాయి. అయితే కొన్నిసార్లు కొత్తజంటలు లేనిపోని పంతాలకు పోయి చేజేతులా తమ బంధాన్ని బలహీనం చేసుకుంటారు. మీ వలపు ప్రయాణం కనుల పంటగా సాగాలంటే కొన్ని పొరపాట్లను చేయకూడదు అవేమిటంటే...


వినడం ముఖ్యం: ఎప్పుడూ మాట్లాడడమే కాదు అప్పుడప్పుడు మీ ప్రియ నేస్తం చెప్పేది వినాలనే వాస్తవాన్ని ఇద్దరూ గ్రహించాలి. ఏదైనా విషయంలో గొడవ పడుతూ ఇద్దరూ ఒకేసారి తమ అభిప్రాయం చెబుతూ ఉంటే ఆ గొడవకు ముగింపు ఉండదు. అందుకే అవతలి వారు చెప్పేది శ్రద్ధగా విని, ఆ తరువాత మాట్లాడితే సమస్య సద్దుమణుగుతుంది. 


అన్నింటా పోటీపడడం: ప్రేమలో ఉన్నప్పటికీ తమ జతతో ప్రతి విషయంలో పోటీ పడుతుంటారు కొందరు. ఒకరి మీద ఒకరు ఈర్ష్య పడే బదులు పరస్పరం గౌరవించుకుంటూ వ్యక్తిగత లక్ష్యాల దిశగా ప్రోత్సహించుకోవాలి. ఇలా చేసినన్ని రోజులు మీ అనుబంధం చూడముచ్చటగా సాగిపోతుంది.


వేచి చూడడం: మీకు బాధగా అనిపించే విషయాన్ని మీ తోడుతో చెప్పేందుకు సరైన సమయం కోసం వేచి చూడక్కరలేదు. మీరు ఇలా ప్రతిదీ మనులోనే దాచుకొని బాధపడడం, ఒకవేళ చెప్పినా మీ ప్రియతమ తేలికగా తీసుకుంటుందేమో అనే భయంతో ఉండడం చివరకు ఊహించని నష్టాన్ని మిగులుస్తుంది.


అబద్ధాలకు బై: చిన్న చిన్న విషయాల్లో అబద్ధాలు చెప్పినంత మాత్రన ఏమీ కాదులే అనుకోవడం చాలా పెద్ద తప్పిదం. ఎందుకంటే మొదటి రోజునే నమ్మకం అనేది మీ బంధానికి వంతెనవుతుంది. ఒక్కసారి మీ అబద్ధాల విషయం తెలిసిందంటే అవతలి వారికి మీపై నమ్మకం పోతుంది.


గత జ్ఞాపకాలు: మీరు బాధలో ఉన్నప్పుడు, గతం తాలూకు జ్ఞాపకాల నుంచి బయటపడొచ్చనే ఆలోచనతో కొత్త బంధంలోకి అడుగుపెట్టకూడదు. మీ అభద్రతా భావం వల్ల మీ భాగస్వామి నొచ్చుకొనే వీలుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉన్నప్పుడే కొత్త ప్రయాణం మొదలెట్టాలి.


సంతోషాన్ని వెతకాలి: ప్రేమ ఒక్కటే ఇద్దరినీ కలిపి ఉంచలేదు. ఏదైనా సాధించాలనే తపన, కష్టపడేతత్వం, అంకితభావం, వ్యక్తిగత విలువలు.... ఇవన్నీ మీ ఇద్దరిని కలిసి సాగేలా చేస్తాయి. అందుకే జంటగా సంతోషాలను పంచుకుంటూ లక్ష్యం దిశగా సాగాలి.


తొందరపడొద్దు: చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. ప్రతిదానికి తొందరపాటు తగదు. మీ జంట ప్రయాణం అన్యోన్యంగా ఉండాలంటే ఇద్దరూ పరణితిగా ఆలోచించాలి. అప్పుడే మీ బంధం కనులవిందుగా మారుతుంది. 


ఒకేలా వద్దు: ప్రేమపక్షులు అయినంత మాత్రాన ఇద్దరూ ఒకే పని చేయాలని, ఒకే చోటకు వెళ్లాలనే  నియమం లేదు.   మీ భాగస్వామి ఇష్టాలను అనుసరించే ప్రయత్నం చేయొద్దు. మీకు నచ్చిన వాటిని హాబీగా మార్చుకోండి. వ్యక్తిగతంగా మీ ఇద్దరూ వేర్వేరనే సంగతి మరచిపోవద్దు. 

Updated Date - 2021-03-10T05:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising