ఈ జాకెట్ రూ.59 లక్షలు
ABN, First Publish Date - 2021-05-19T05:30:00+05:30
అమెరికా పాప్ లెజెండ్ జనెట్ జాక్సన్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. గాయనిగానే కాకుండా పాటల రచయితగా, నటిగా అన్నిటికీ మించి మైకేల్ జాక్సన్‌ను మరిపించే డ్యాన్సర్‌గా జనెట్ స్థానం ప్రత్యేకం
అమెరికా పాప్ లెజెండ్ జనెట్ జాక్సన్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. గాయనిగానే కాకుండా పాటల రచయితగా, నటిగా అన్నిటికీ మించి మైకేల్ జాక్సన్‌ను మరిపించే డ్యాన్సర్‌గా జనెట్ స్థానం ప్రత్యేకం. ఐదుసార్లు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు గెలుచుకున్న జనెట్ జాక్సన్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. 1990లో ‘రిథమ్ నేషన్’ టూర్ సందర్భంగా ఈ పాప్ స్టార్ వేసుకున్న మిలిటరీ స్టయిల్ బ్లాక్ లెదర్ జాకెట్... వేలంలో రూ.59.29 లక్షలకు అమ్ముడైంది.నిర్వాహకుల అంచనా కంటే ఇది 20 రెట్లు ఎక్కువ.
‘జులియన్స్ ఆక్షన్స్’ ఇటీవల నిర్వహించిన ఈ వేలంలో నాలుగు దవాబ్దాల జాక్సన్ కెరీర్‌లో ఉపయోగించిన అరుదైన డ్రెస్‌లను అమ్మకానికి పెట్టారు. ‘రిథమ్ నేషన్’... సోలో ఆర్టిస్ట్‌గా జాక్సక్‌కు మొట్టమొదటి వరల్డ్ టూర్. ఆమెను ప్రపంచ ప్రఖ్యాత ర్యాపర్‌ను చేసిన ప్రదర్శన అది. విశేషమేమంటే ‘రిథమ్ నేషన్’ జాకెట్ ప్రొటోటైప్‌కు కూడా భారీ ధర పలికింది. రూ.16 లక్షలకు దీన్ని దక్కించుకున్నారు. అయితే వీటిని కొనుగోలు చేసినవారి వివరాలను మాత్రం సంస్థ గోప్యంగా ఉంచింది. వేలం ద్వారా వచ్చిన దాంట్లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం కేటాయించి తన గొప్ప మనసు చాటుకుంది జాక్సన్.
Updated Date - 2021-05-19T05:30:00+05:30 IST