ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రేక్‌ప్‌‌లో టాప్‌

ABN, First Publish Date - 2021-02-17T08:48:51+05:30

ప్రేమ మిగిల్చే బాధ బ్రేకప్‌. ప్రేమికుల్లో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు బ్రేకప్‌ రుచి చూసినవాళ్లే. తాజాగా ఒక డేటింగ్‌ యాప్‌ సర్వేలో గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో ఢిల్లీలోనే ఎక్కువ బ్రేకప్స్‌ నమోదయ్యాయనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ మిగిల్చే బాధ బ్రేకప్‌. ప్రేమికుల్లో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు బ్రేకప్‌ రుచి చూసినవాళ్లే. తాజాగా ఒక డేటింగ్‌ యాప్‌ సర్వేలో గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో ఢిల్లీలోనే ఎక్కువ బ్రేకప్స్‌ నమోదయ్యాయనే విషయం వెలుగులోకి వచ్చింది. మహిళలు విరివిగా ఉపయోగించే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ‘బంబుల్‌’ జరిపిన సర్వే ఏం చెబుతోందంటే... లాక్‌డౌన్‌ సమయంలో మిగతా పట్టణాలతో పోల్చితే ఢిల్లీలో బ్రేకప్‌ కేసులు 28శాతం. అందుకు కరోనా వల్ల వ్యక్తిగత ప్రాధమ్యాలు మారడమే ప్రధాన కారణం. డేటింగ్‌ యాప్స్‌ వాడుతున్న 48శాతం మందిలో ఇద్దరిలో ఒకరు కొత్తగా ఈ యాప్స్‌లో చేరినవారే. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో బ్రేకప్‌ అయి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్న వారు కావడం విశేషం.  తాము బ్రేకప్‌ అవడానికి లాక్‌డౌన్‌ సమయంలో తమ ప్రియతమను కలవలేకపోవడం ఒక కారణమని 46.45శాతం మంది చెప్పారు. లాక్‌డౌన్‌ ప్రస్తుత పరిస్థితులను స్తబ్దుగా మార్చేసిందనేది 29శాతం మందిలో ముగ్గురిలో ఒకరి అభిప్రాయం. 


అయితే 2021లో చాలామంది తమ సరిజోడును వెతుక్కోవాలనే ఆసక్తితో ఉన్నారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలు ఈసారి మంచి లక్షణాలున్న అబ్బాయినే ఎంచుకోవాలనుకుంటున్నారు. మనదేశంలో డేటింగ్‌ యాప్‌లో ప్రొఫైల్‌ సగం నింపిన, ఖాళీగా ఉంచిన వారితో పోల్చితే పూర్తిగా ప్రొఫైల్‌ నింపిన వారికే 41శాతం ఎక్కువ మ్యాచెస్‌ వస్తున్నాయి. అయితే చాలామంది మీ ఇష్టాలు, మీరు కోరుకునే వాటిపైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. 


డేటింగ్‌ యాప్స్‌ సలహాలు: ప్రొఫైల్‌ ఫొటో కచ్చితంగా సదరు వ్యక్తిదై ఉండాలి. అప్పుడే మ్యాచెస్‌ కోసం వెతికేవారికి తాము ఎవరి ప్రొఫైల్‌ చూస్తున్నారో తెలుస్తుంది. స్నేహితులతో కలిసి దిగిన కొన్ని గ్రూప్‌ ఫొటోలు కూడా పెట్టవచ్చు. 


ఫొటోల ద్వారా తమ గురించి చెప్పకనే చెప్పవచ్చు. అదెలాగంటే.. మీకు పర్యటనలంటే ఇష్టం అనుకోండి, మీరు వివిధ ప్రదేశాల్లో దిగిన ఫొటోలు పోస్ట్‌ చేయాలి. అలాగే కుకింగ్‌ మీ ప్యాషన్‌ అయితే మీరు వండిన వంటకాల ఫొటోలు లేదా మీకు నచ్చిన రెస్టారెంట్‌ వివరాలు ప్రొఫైల్‌లో ఇవ్వాలి. 

ఇండియన్స్‌ ఆదివారం, అదీ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు డేటింగ్‌ యాప్స్‌లో ఎక్కువగా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి.           

Updated Date - 2021-02-17T08:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising