ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలా చూశానో లేదో ఇలా పడ్డానే...

ABN, First Publish Date - 2021-01-27T07:56:44+05:30

ఓపెన్‌ చేస్తే ఓ ప్లెజెంట్‌ ఫ్రేమ్‌. పచ్చదనం నిండిన ప్రకృతి ఒడిలో ఆహ్లాదాన్ని పంచే ఓ పాత కాలపు ఇల్లు. ఆ ఇంటి మేడపైనుండే ఓ కుర్రాడు ఒక చేతిలో టీ గ్లాసు, ఇంకో చేతిలో మొబైల్‌ పట్టుకుని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూట్యూబ్‌ హిట్‌


ఓపెన్‌ చేస్తే ఓ ప్లెజెంట్‌ ఫ్రేమ్‌. పచ్చదనం నిండిన ప్రకృతి ఒడిలో ఆహ్లాదాన్ని పంచే ఓ పాత కాలపు ఇల్లు. ఆ ఇంటి మేడపైనుండే ఓ కుర్రాడు ఒక చేతిలో టీ గ్లాసు, ఇంకో చేతిలో మొబైల్‌ పట్టుకుని బాధపడుతుంటాడు... ‘ప్రేమ అనే ఈ ప్రపంచంలో నాదీ అనుకునేటట్టు ఒక్క పిల్ల లేదు’ అని! ఇంతలో ఓ అందమైన అమ్మాయి ఇంటి సామానుతో అక్కడ ప్రత్యక్షమవుతుంది. ‘దేవుడా..! పక్కింట్లో ఉంటే చాలనుకున్నాను. కానీ డైరెక్ట్‌గా మా ఇంటి కిందకు వచ్చేసిందా! సామాన్లు సర్దేలోపు సెట్‌ చేయాలి’ అనుకుంటూ కిందకు దిగుతాడు. 


‘అలా చూశానో లేదో ఇలా పడ్డానే 

ఎలా పడ్డానో ఏమో నాకూ తెలీదే..’ 


బ్యాగ్రౌండ్‌లో మెలోడియస్‌గా పాట ప్లే అవుతుంటే... అబ్బాయి కేరింతలు, అమ్మాయిపై అందమైన కెమెరా షాట్లు! తనకు ఆమె తలపు తప్ప మరే ప్రపంచమూ లేదనేంతగా మైమరిచిపోతాడు. ఆ విషయాన్ని తనకు తెలిసేలా చేయాలని ఆమె కంట పడీ పడనట్టుగా... ఆమె వెంట పడీ పడనట్టుగా... లైను వేసి లంగరేసి లవ్వులోకి దింపాలని ప్రయత్నిస్తుంటాడు. తను ఎప్పుడు చూసినా పెరట్లో ఓ కాన్వాస్‌ పెట్టి ఏదో పెయింటింగ్‌ వేస్తుంటుంది. ఒకరోజు అతడికి సందేహం కలుగుతుంది... ‘అసలు ఏంచేస్తుంది? ఎప్పుడు చూసినా బ్రష్‌ పట్టుకుని అటూ ఇటూ ఆడిస్తూనే ఉంటుంది’ అనుకుంటూ ఆ కాన్వాస్‌పై కప్పిన గుడ్డను తీయబోతాడు. ఇంతలో ఆమె అక్కడికి వస్తుంది. గాలికి కాన్వాస్‌పైనున్న గుడ్డ ఎగిరిపోతుంది. ఆ చిత్రాన్ని చూసి షాకవుతాడు. దానిపై ఉన్నది ఎవరో కాదు... ఆమెతో అతడు! అప్పుడు గానీ అర్థంకాదు అతడికి ఆమె మనసు. ఇద్దరూ కలిసింది లేదు. మాట్లాడుకుంది లేదు. కనీసం కప్పు కాఫీ తాగలేదు. కానీ ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది.  


‘నువ్వేవి చేశావో ఏమో నువ్వే చెప్పాలే 

నా లోకం నాదే ఎపుడూ ఈ మైకం కమ్మేవరకూ....’


తన మనసు మౌనంగానే అతడి ముందు ఆవిష్కరిస్తుందా అమ్మాయి. ‘దేవుడా అని పిలిచినందుకు దేవతలాంటి పిల్లనిచ్చినావు. నువ్విచ్చినావుగా... వదిలేయ్‌ నేను చూసుకుంటా ఇక’ అని అతడు అనడంతో ముగుస్తుంది ‘చూస్తూ చూస్తూ రోజులు గడిచే’ లఘుచిత్రం. నిజంగా ఈ ఏడు నిమిషాల చిత్రం చూస్తున్నంతసేపూ ఎక్కడికో తీసుకువెళ్లిపోతుంది. దీనికి కథ, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ వినయ్‌ షణ్ముఖ్‌. సినిమా పాటకు ఏమాత్రం తీసిపోని తరహాలో సంగీతాన్ని అందించాడు విజయ్‌ బల్గనిన్‌. దీప్తి సునైనా, సుమంత్‌ ప్రభాస్‌ల నటన, సురేశ్‌ బానిసెట్టి లిరిక్స్‌ మరో ప్లస్‌ ఈ చిత్రానికి. యూట్యూబ్‌లో విడుదలైన ఈ షార్ట్‌ ఫిలిమ్‌ను ఇప్పటికి ఐదున్నర మిలియన్లమంది వీక్షించారు. 

Updated Date - 2021-01-27T07:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising