ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ఊరి సీత

ABN, First Publish Date - 2021-02-17T08:45:54+05:30

హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ కార్యాలయం. అందులో రామ్‌, అతని స్నేహితుడు పనిలో నిమగ్నమై ఉంటారు. ఇంతలో రామ్‌ ఫోన్‌ రింగవుతుంది. ‘ఒరే రామ్‌.. ఎక్కడున్నావ్‌’... నాన్న పలకరింపు. ‘చెప్పండి నాన్నా. ఏంటి విషయం’... ‘రేపటి నుంచి సెలవులు అన్నావు కదా! మన అయోధ్యాపురానికి వచ్చేయ్‌’ అన్న నాన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ కార్యాలయం. అందులో రామ్‌, అతని స్నేహితుడు పనిలో నిమగ్నమై ఉంటారు. ఇంతలో రామ్‌ ఫోన్‌ రింగవుతుంది. ‘ఒరే రామ్‌.. ఎక్కడున్నావ్‌’... నాన్న పలకరింపు. ‘చెప్పండి నాన్నా. ఏంటి విషయం’... ‘రేపటి నుంచి సెలవులు అన్నావు కదా! మన అయోధ్యాపురానికి వచ్చేయ్‌’ అన్న నాన్న పిలుపునకు వెంటనే ఓకే చెబుతాడు రామ్‌. నిజానికి  రామ్‌ వాళ్లది విజయవాడ. అయోధ్యాపురం వాళ్ల అత్తయ్య గారిది. ‘సొంత ఊరు వెళ్లకుండా అత్తయ్య గారి ఇంటికి ఎందుకు వెళుతున్నావురా’... అడుగుతాడు స్నేహితుడు. ‘దానికి వెనకాల పెద్ద కథే ఉందిరా. అయినా అంతా సిటీ సిటీ అంటారు కానీ మా మనసులు మాత్రం అక్కడే. ఆ మట్టి వాసన.... ఆ స్వచ్ఛమైన గాలి... ఊరికి రక్షణగా ఉండే మా కొండాళమ్మ... మేము ఎంతగానో ప్రేమించే మా పశువులు... మాకు మంచినీళ్లిచ్చే ఊరి కొలను... వీటన్నింటికీ మించి ఎంతిచ్చిన కొనలేని ఆప్యాయతలు...! ఓహ్‌! పల్లె అందాలు మాటల్లో వర్ణించలేము’’ అంటాడు రామ్‌. ‘నేను చిన్నప్పటి నుంచి నగరంలోనే పెరిగాను. పల్లెటూరు గురించి వినడమే కానీ... ఎప్పుడూ చూడలేదు. నేనూ వస్తానురా’ అంటాడు స్నేహితుడు. ‘సరే పదా’ అంటూ ఇద్దరూ అయోధ్యాపురం వెళతారు ఇద్దరూ. దిగగానే... పాత రోజులు గుర్తుకువస్తాయి రామ్‌కు. పేరుకు తగ్గట్టుగానే అయోధ్యాపురంలో మనోడు రాముడైతే... సీత కూడా ఉంటుంది. ఆ సీతే ఈ రాముడి హృదయాన్ని దోచుకున్న వనిత. 


అవి రామ్‌ పదో తరగతి ప్రారంభమైన రోజులు. తొలి రోజు రెడీ అయ్యి స్కూల్‌కు వెళతాడు రామ్‌. క్లాస్‌ అంతా ఖాళీగా ఉంటుంది. ‘ఎవరూ రాలేదేంటబ్బా’ అనుకుంటాడు. ఇంతలో ఓ అమ్మాయి వచ్చి తరగతి గది గుమ్మం ముందు నిలుచుంటుంది. 


ఆమెను చూడగానే తనను తాను మరిచిపోతాడు రామ్‌. ‘ఏమండీ... పదో తరగతి ఇదేనా’ అడుగుతుందా అమ్మాయి. తనే సీత. తేరుకున్న రామ్‌... ‘అవునండీ... ఇదే’ అంటాడు. ‘ఎప్పుడూ స్కూల్లో మిమ్మల్ని చూడలేదు’... అని రామ్‌ అంటే... ‘న్యూ జాయినింగ్‌’ అని బదులిస్తుంది ‘ఆకాశంలో చందమామ కింద తిరుగుతుందన్నారు. అది మీరేనా’... పరవశంతో అడుగుతాడు రామ్‌. అతడి మాటలకు సీత పడి పడి నవ్వుతుంది. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు రామ్‌. ఆ విషయం తనతో చెప్పేస్తాడు. అందుకు తను కూడా ఓకే అంటుంది. ప్రేమలో పడి రామ్‌ చదువులో వెనక పడతాడు. అతడి నడవడి కూడా మారిందని ఊళ్లో వాళ్లంతా వాళ్ల నాన్నకు చెబుతారు. దీంతో పిల్లాడు దారి తప్పుతున్నాడని గ్రహించిన తండ్రి రామ్‌ను పట్టణం పంపించి చదివిస్తాడు. మళ్లీ ఇప్పుడే అయోధ్యాపురం రావడం. సీతను ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఆరాటపడుతుంటాడు.


అయితే సీతకు పెళ్లయిపోయిందని స్నేహితుడి ద్వారా రామ్‌కు తెలుస్తుంది. అనుకోకుండా ఒక రోజు ఊళ్లో సీతను కలుస్తాడు రామ్‌. ఆమెను మీ భర్త ఎలా ఉన్నాడని అడుగుతాడు. ‘నాకు ఇంకా పెళ్లి కాలేదు’ అంటుంది సీత. దాంతో రామ్‌ షాకవుతాడు. ఆ తరువాత ఏం జరిగిందన్నది ‘మా ఊరి సీత’ లఘుచిత్రంలో చూడాల్సిందే. దీనికి కథ, మాటలు, దర్శకత్వం మేడపాటి ధన ప్రణీత్‌రెడ్డి. రామ్‌, సీతగా రమేశ్‌, రేణుక నటించారు. కథ పరంగా బానే ఉన్నా నటీనటుల హావభావాలు తెచ్చిపెట్టుకున్నట్టు ఉంటాయి. డైలాగ్‌లు పట్టి పట్టి చెప్పడంతో ఒరిజినాలిటీ పోయింది. కానీ మొత్తం మీద కథ ఆసక్తిగానే సాగుతుంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ షార్ట్‌ ఫిలిమ్‌ మంచి ఆదరణ పొందుతోంది.

Updated Date - 2021-02-17T08:45:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising