ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలా చూశానో లేదో..!

ABN, First Publish Date - 2021-05-26T09:41:57+05:30

ఓపెన్‌ చేస్తే... కాఫీ షాప్‌. ఓ అందమైన యువతి వచ్చి, కాఫీ ఆర్డర్‌ చేస్తుంది. మరుక్షణంలో టేబుల్‌పై కాఫీ. ఓ సిప్‌ వేసేలోగా ఆమె బుగ్గపై ఓ కిస్‌! షాక్‌! ఎవరతను? అంతకముందెన్నడూ అతడిని చూడను కూడా చూడలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓపెన్‌ చేస్తే... కాఫీ షాప్‌. ఓ అందమైన యువతి వచ్చి, కాఫీ ఆర్డర్‌ చేస్తుంది. మరుక్షణంలో టేబుల్‌పై కాఫీ. ఓ సిప్‌ వేసేలోగా ఆమె బుగ్గపై ఓ కిస్‌! షాక్‌! ఎవరతను? అంతకముందెన్నడూ అతడిని చూడను కూడా చూడలేదు. మరి ఈ ట్విస్ట్‌ ఏమిటి? ఆ కిస్‌ ఏమిటి? తేరుకునేలోగా అతడు వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చొంటాడు. కోపంతో ఊగిపోతూ ‘రేయ్‌... ఎవడ్రా నువ్వు?’ అని ఆమె ప్రశ్నిస్తుంది. ‘హాయ్‌... ఐయామ్‌ ఆర్య’... షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోతాడు! వాడితో నాకు మాటలేంటన్నట్టు ‘ఛీ’ అంటూ చికాకు పడుతుంది. ‘అసలు ఎందుకు కిస్‌ చేశావ్‌?’. ‘చెబితే నమ్ముతారా? మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. నా ఇష్టాన్ని మాటల్లో చెప్పలేక, ఎలా చెప్పాలో అర్థంకాక కిస్‌ పెట్టేశాను’... సమర్థించుకోబోతాడు. ‘వేస్ట్‌ ఫెలో’ అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది తను.


ఆమె వెంట పడతాడు ఆర్య. ఇదంతా చూస్తున్న వెయిటర్‌... ఆపుకోలేక ఆ అమ్మాయి వెంట వెళుతున్న ఆర్యను ఆపి... ‘ఏంటి సార్‌ అలా ముద్దు పెట్టేశారు? తనెవరు... మీ గర్ల్‌ఫ్రెండా?’... అడుగుతాడు. ‘కాదు... ఇప్పుడు చేసుకోవాలి’ అంటాడు ఆర్య. ఎలా? అర్థంకాదు వెయిటర్‌కి. ‘వెయిట్‌ చెయ్యి... నీకే తెలుస్తుంది’ అంటూ ఆమెను ఫాలో అవుతాడు ఆర్య. ‘ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఈ జన్మకి మీరే నా గర్ల్‌ఫ్రెండ్‌. ఇంకా చెప్పాలంటే నా వైఫ్‌ కూడా!’ అంటూ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు ఆర్య. ‘నువ్వు ఎందుకు నన్నిలా తగులుకున్నావు?’ అంటే... ‘పది నిమిషాలు కూర్చోండి. మీకు వివరంగా చెబుతాను. ఆ తరువాత ఇష్టంలేకపోతే మీ వెంటపడను’ అంటాడు. వాడిని వదిలించుకొందామని సరేనంటుంది తను. ‘ఈ గ్యాప్‌లోనే పడేసి తీసుకువచ్చాడా’... వెయిటర్‌ ఆశ్చర్యం. మళ్లీ ఆమెది అదే ప్రశ్న... ‘అసలు కిస్‌ ఎందుకు పెట్టావ్‌?’. ‘చెప్పానుగా... మీరు నాకు... చూడగానే నచ్చేశారని’.


‘అలా ఎలా... ఇలా చూడగానే! నా గురించి నీకేం తెలుసు?’ అనగానే... ‘మీ కళ్లను చూసి ఇష్టపడ్డాను’ అంటూ బదులిస్తాడు ఆర్య. ఆ యువతి పెదవులపై చిరునవ్వు. ‘మరి మాటల్లో చెప్పకుండా ముద్దు ఎందుకు పెట్టావు?’. ‘నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అందుకే ముద్దుతో చెప్పాలనుకున్నా. ఇంకో విషయం తెలుసా? మీరు నా బైక్‌ను డ్యాష్‌ ఇవ్వగానే, అందులో డబ్బు పెట్టి వెళ్లిపోయారు కదా. అది నన్ను ఆకట్టుకుంది’ అంటాడు ఆర్య. కప్పులో కాఫీలానే తనూ మరింత చల్లబుడుతుంది. ‘పది నిమిషాల్లోనే ప్రేమ పుడుతుందని, అద్భుతాలు జరుగుతాయని నేను నమ్మను’ అంటున్న తను ఆర్య ప్రేమకు ఓకే చెబుతుందా? లేదా? క్లైమాక్స్‌ ఏమిటన్నది ‘అలా చూశానో లేదో’ షార్ట్‌ ఫిలిమ్‌లో చూస్తేనే బాగుంటుంది. పృధ్వీ, శివయామిని నటన ఆకట్టుకుం టుంది. లాజిక్‌లు వెతక్కపోతే... కొత్తదనాన్ని ఆవిష్కరించడానికి దర్శకుడు ఎంఎల్‌ రెడ్డి చేసిన ప్రయత్నం అభినందనీయం. యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పటికి 1.83 లక్షల మంది వీక్షించారు. లైక్‌లూ వేలల్లోనే ఉన్నాయి.

Updated Date - 2021-05-26T09:41:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising