మాటే వినదుగా..!
ABN, First Publish Date - 2021-05-05T05:30:00+05:30
ఒక అమ్మాయి. పార్కులో జాగింగ్‌కు వెళుతుంది. చెట్టు చాటు నుంచి గమనిస్తున్న ఓ కుర్రాడు సడెన్‌గా ఆమె ముందు ప్రత్యక్షమవుతాడు. అతడిని చూసిన ఆమె... ‘ఏంటి వివేక్! ఇక్కడేం చేస్తున్నావ్’ అని...
ఒక అమ్మాయి. పార్కులో జాగింగ్‌కు వెళుతుంది. చెట్టు చాటు నుంచి గమనిస్తున్న ఓ కుర్రాడు సడెన్‌గా ఆమె ముందు ప్రత్యక్షమవుతాడు. అతడిని చూసిన ఆమె... ‘ఏంటి వివేక్! ఇక్కడేం చేస్తున్నావ్’ అని అడుగుతుంది. ‘ఇన్నాళ్లూ నీకు తెలియకుండా వెంట వస్తున్నా. ఇప్పుడు నీకు పెళ్లి కుదిరిందని తెలిసి మనసులో మాట చెప్పేస్తున్నా. ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ సమీరా’ అంటాడు వివేక్. ‘ఓహ్... అయినా నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు’ అంటుంది తను. ‘నేను నమ్మను’ అని వివేక్ చెబుతుంటే... ‘అతడు కొంచెం సీక్రెట్ టైప్‌లే. అంటే... రమ్మన్నప్పుడు వస్తాడు. వెళ్లిపోమన్నప్పుడు వెళ్లిపోతాడు’ అంటుంది సమీర. ‘ఇంత సెన్సిటివ్ మేటర్ నాతో ఎందుకు షేర్ చేసుకొంటున్నావ్’... సందేహంగా అడుగుతాడు వివేక్. ‘కదా... మే బీ లవ్ ఏమో’ అంటుంది తను. మనోడు సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకొంటాడు. సీన్ కట్ చేస్తే... అమెరికా నుంచి అమ్మాయిని చూడ్డానికి సిద్దూ వస్తాడు. తరువాతి రోజు ఉదయం... మార్నింగ్ వాకింగ్‌కు వెళతాడు. అక్కడ ఓ యువతి కనిపిస్తుంది. దూరం నుంచి చూసి తను చూడబోయేది ఆ అమ్మాయినే అని తెలుసుకొంటాడు. ఈలోపు తనే వచ్చి సిద్దూని పలుకరిస్తుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు పరిచయం చేసుకొంటారు.
సిద్దూ తన ఉద్యోగం, ఆస్తిపాస్తుల గురించి చెబుతాడు. ‘నా గురించి మీకు ఏంతెలుసు’... సమీర ప్రశ్న. ‘మీ గురించి మీ పేరు తప్ప నాకు పెద్దగా ఏమీ తెలియదండీ’... సిద్దూ బదులిస్తాడు. ‘ఓకే... నెక్స్ట్ మీట్‌లో మనం మళ్లీ మాట్లాడుకొందాం’ అని వెళ్లిపోతుంది సమీర. తరువాత పెద్దల ఆధ్వర్యంలో మళ్లీ ఇద్దరూ కలుస్తారు. ఇంటికి వెళ్లిన సమీర అతడంటే ఇష్టం లేదని చెబుతుంది. ఎందుకని ఆమె తల్లి అడిగితే... సిద్దూ మంచివాడే కానీ తనను తాను గొప్పగా చెప్పుకొనే తీరు నచ్చలేదంటుంది. వేరే అబ్బాయిని చూద్దాంలే అంటుంది సమీర తల్లి. విషయం సిద్దూకు తెలిసి ‘అమెరికా సంబంధం. లగ్జరీ లైఫ్. ఒక అమ్మాయికి ఇంతకంటే ఇంకేం కావాలి? పోతే పోనీ’ అంటూ స్నేహితుల దగ్గర తన కోపాన్ని వెళ్లగక్కుతాడు. ‘ఆ అమ్మాయికి సెటిల్‌మెంట్ ఒక్కటే ముఖ్యం కాదేమో’ అని ఓ స్నేహితుడు సర్దిచెప్పబోతాడు. ‘అదేదో ఆ అమ్మాయినే అడిగి తెలుసుకొంటా’నని ఆమె ఇంటికి వెళతాడు. అదే ప్రశ్న సమీరని అడుగుతాడు. ‘మీరు నాకు చాలా నచ్చేశారు. అందుకే మీరు వద్దన్నా ఇలా వచ్చాను. కనీసం నేను మీకు ఎందుకు నచ్చలేదో చెప్పండి’ అంటాడు. తనేమీ చెప్పదు. మరుసటి రోజు మళ్లీ వస్తాడు. అలా ఆమె ఇంటటి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కానీ ఆమె ఏమీ మాట్లాడదు. మరో సంబంధం... మరో మీటింగ్. ఈసారీ అతను నచ్చడు సమీరకు. ఈ లోపు సిద్దూ స్నేహితులు సమీరకు ఫోన్ చేసి కలుస్తారు. ‘చెప్పండి... ఎందుకు రమ్మన్నారు’... సమీర అడుగుతుంది. ‘సిద్దూ తరుపున సారీ చెప్పడానికి వచ్చాం’ అంటూ మొదలెడతారు. మరి సిద్దూ స్నేహితుల రాయబారం ఫలిస్తుందా? సమీర మనసు మారుతుందా? అది తెలియాలంటే యూట్యూబ్‌లో ‘మాటే వినదుగా’ షార్ట్ ఫిలిమ్ చూడాలి. ఇందులో సమీర, సిద్దూల మధ్య సన్నివేశాలు ఆసక్తిగా సాగుతాయి. సిద్దూ దివాకర్, ఆర్షితారావుల నటన ప్రధాన ఆకర్షణ. ఇక వైఎన్ లోహిత్ బాబు కథ, దర్వకత్వ ప్రతిభ సింప్లీ సూపర్బ్. యూట్యూబ్‌లో ఇప్పటికి దాదాపు 15 లక్షల మంది వీక్షించారు.
Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST