America లో సంచలన బిల్లు.. శృంగారం మధ్యలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్‌ను తొలగిస్తే..
ABN, First Publish Date - 2021-09-14T22:29:21+05:30
అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సరికొత్త బిల్లును తీసుకువస్తోంది. సంభోగ సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగించకూడదు. ఒకవేళ అలా చేస్తే దాన్ని ఇకపై నేరంగా పరిగణించడంతో పాటు శిక్షార్హులు అవుతారు.
కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సరికొత్త బిల్లును తీసుకువస్తోంది. సంభోగ సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగించకూడదు. ఒకవేళ అలా చేస్తే దాన్ని ఇకపై నేరంగా పరిగణించడంతో పాటు శిక్షార్హులు అవుతారు. ఇదే విషయమై ఏబీ 453 పేరిట కాలిఫోర్నియా కొత్త బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లును కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు క్రిస్టినా గార్సియా ప్రతిపాదించగా ఆ రాష్ట్ర శాసనసభ తాజాగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ బిల్లు కాలిఫోర్నియా గవర్నర్ గేవిన్ న్యూసమ్ వద్దకు చేరింది. అక్టోబర్ 10 వరకు గవర్నర్‌కు ఈ బిల్లుపై తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందితే మాత్రం ఇలాంటి సంచలన బిల్లు తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచిపోనుంది.
ఇక తాజాగా రాష్ట్ర శాసన సభలో ఈ బిల్లు ఆమోదం పొందడంపై అసెంబ్లీ సభ్యురాలు, బిల్లు రూపకర్త క్రిస్టినా గార్సియా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఈ నెల 8న ఓ ట్వీట్ చేశారు. "బిల్లు ఏబీ453 గవర్నర్ వద్దకు వెళ్లింది. గవర్నర్ ఈ బిల్లుపై సంతకం చేసి ఆమోదిస్తారని అనుకుంటున్నాను. శృంగారం సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగించడం అనేది నేరం అని ఈ బిల్లు పేర్కొటోంది. ఇకపై అలా చేస్తే శిక్షార్హులు" అని ఆమె ట్వీట్ చేశారు.
ఇదే తరహాలో న్యూయార్క్ సెనేట్‌లో కూడా 2019 మార్చిలో డయాన్ జే సేవినో కూడా ఎస్4401 పేరిట ఓ బిల్లును ప్రవేశపెట్టారు. న్యూయార్క్ రాష్ట్ర సెనేట్ వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం ఇంకా ఈ బిల్లు సెనేట్‌లోనే ఉంది. అటు విస్కాన్సిన్ రాష్ట్ర ప్రతినిధి మెలిస్సా సార్జెంట్ కూడా ఇదే విషయమై 2017లో ఓ బిల్లును ప్రతిపాదించారు. అయితే, ఈ బిల్లు భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగిస్తే.. అవాంఛిత గర్భం, లైంగిక సంబంధిత అంటు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని పేర్కొంటోంది.
అసలేంటి ఈ 453 బిల్లు..
లైంగిక వేధింపులకు సంబంధించి కాలిఫోర్నియా సివిల్ కోడ్‌లోని సెక్షన్ 1708.5ను సవరిస్తూ 453 బిల్లును తీసుకురావడం జరిగింది. సంభోగ సమయంలో ఏ విధంగాను భాగస్వామిని గాయపరిచేలా వ్యవహరించడం నేరం అని 1708.5 సెక్షన్ పేర్కొంటోంది. అంటే.. భాగస్వామి(ఆమె, అతడు) జననాంగాలను, ఇతర ప్రైవేట్ పార్ట్స్‌ను గాయపరచకూడదు. దీనికి కొనసాగింపుగా తీసుకొచ్చిందే 453 బిల్లు. శృంగార సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్స్ తొలిగించడానికి వీల్లేదు. ఒకవేళ భాగస్వామి అనుమతి లేకుండా సంభోగం మధ్యలో కండోమ్ తొలగిస్తే అది నేరంగా పరిగణించబడుతోంది.
ఇవి కూడా చదవండి..
Kuwaitలో వలసదారులకు కొత్త కష్టం.. అడుగుపెట్టగానే వాళ్లంతా మీద పడుతున్నారే..!
Americaలో కొత్త బిల్లు.. Green card విషయంలో భారతీయులకు తీపికబురు!
Updated Date - 2021-09-14T22:29:21+05:30 IST