ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు విషపు ఆహారాన్ని ఇచ్చి.. పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి అరెస్ట్!

ABN, First Publish Date - 2021-04-10T22:22:37+05:30

నివసించేందుకు కనీసం ఇళ్లు కూడా లేని పేదలపట్ల ఓ వ్యక్తి దారుణంగా వ్యవహరించాడు. విషపు ఆహారాన్ని తిని.. నొప్పితో అల్లాడుతున్న వారి దృశ్యాలను చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందాడు. పూర్తి వివరాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్: నివసించేందుకు కనీసం ఇళ్లు కూడా లేని పేదలపట్ల ఓ వ్యక్తి దారుణంగా వ్యవహరించాడు. విషపు ఆహారాన్ని తిని.. నొప్పితో అల్లాడుతున్న వారి దృశ్యాలను చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర కాలిఫోర్నియా‌కు చెందిన విలియం కేబుల్ (38).. గత ఏడాది మేలో బీచ్ టౌన్‌లోని కొందరు పేదలకు ‘స్పైసీ ఫుడ్ ఛాలెంజ్’ పేరుతో విషపు ఆహారాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలో సదరు పేదలు.. విలియం ఇచ్చిన ఆహారాన్ని ఉత్సాహంగా తిన్నారు. అనంతరం వారు తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, శ్వాస సంబంధ సమస్యలతో బాధ పడుతూ ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు కోలుకున్నారు.



దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన విలియం కేబుల్ బండారం బయటపడింది. పేదలకు విలియం కేబులే విషపు ఆహారాన్ని ఇచ్చాడని.. వాళ్లు దాన్ని తిని కడుపు నొప్పితో అల్లాడుతుంటే.. ఆ దృశ్యాలను చిత్రీకరించాడని గుర్తించారు. దీంతో విలియం కేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, జైలు తరలించారు. కాగా ప్రస్తుతం ఈ కేసును కోర్టు విచారిస్తోంది. నేరం రుజువైతే.. విలియం కేబుల్‌కు దాదాపు 19 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 


Updated Date - 2021-04-10T22:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising