క్యూట్‌గా ఉందని ఫొటోలకు ఫోజుల్చింది.. తీరా దాని గురించి తెలుసుకుని!
ABN, First Publish Date - 2021-03-25T01:50:15+05:30
సాధారణంగా మనం ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే అక్కడి విచిత్ర వస్తువులు, చారిత్రక కట్టడలతో ఫొటోలు దిగడం సహజం. అందరిలాగే అమెరికాకు చెందిన ఓ మహిళ కూడా సముద్ర తీరంలో కనిపించిన ఓ వింత జీవిని
వాషింగ్టన్: సాధారణంగా మనం ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే అక్కడి విచిత్ర వస్తువులు, చారిత్రక కట్టడలతో ఫొటోలు దిగడం సహజం. అందరిలాగే అమెరికాకు చెందిన ఓ మహిళ కూడా సముద్ర తీరంలో కనిపించిన ఓ వింత జీవిని చేతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే తాను పట్టుకున్నది ఓ ప్రాణాంతక జీవినని తెలుసుకోవడానికి ఆమెకు ఎంతో సమయం పట్టలేదు. దాని గురించి తెలుసుకుని కంగుతిన్న ఆ మహిళ.. ఆమె ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కైలిన్ మేరీ ఇటీవల ఇండోనేషియాలోని బాలీ ఐలాండ్‌ను సందర్శించారు. సముద్ర తీరంలో సేద తీరుతున్న ఆమెకు ముదురు గోదుమ రంగు, నల్లటి మచ్చలతో కూడిన ఓ చిన్ని ఆక్టోపస్ ఆకారంలో ఉన్న జీవిని చూసి ముచ్చటపడింది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుని ఫొటోలకు ఫోజులచ్చింది. అనంతరం దాని గురించి తెలుసుకునేందుకు గూగుల్‌ను ఆశ్రయించి అవాక్కైంది. ప్రపంచ ప్రాణాంతక జంతులలో అదికూడా ఒకటి అని తెలుకుని కంగుతింది. దానిలోని విషం ద్వారా నిమిషాల్లో 26 మందిని చంపగలది తెలసుకుని భయాందోళనలకు గురైంది. వెంటనే తనకు ఎదురైన అనుభాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
Updated Date - 2021-03-25T01:50:15+05:30 IST