కరోనాతో పోరాడుతూ.. అమెరికన్ మిలియనీర్ ఆత్మహత్య !
ABN, First Publish Date - 2021-03-23T15:38:18+05:30
కరోనా వైరస్ లక్షణాలతో పోరాడుతూ ప్రముఖ అమెరికన్ మిలియనీర్, టెక్సాస్ రోడ్‌హౌసెస్ రెస్టారెంట్ చైన్ వ్యవస్థాపకుడు కెంట్ టేలర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వాషింగ్టన్: కరోనా వైరస్ లక్షణాలతో పోరాడుతూ ప్రముఖ అమెరికన్ మిలియనీర్, టెక్సాస్ రోడ్‌హౌసెస్ రెస్టారెంట్ చైన్ వ్యవస్థాపకుడు కెంట్ టేలర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత వారమే టేలర్ సూసైడ్ చేసుకోగా ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. తాజాగా ఆయన కుటుంబ సభ్యులు, కంపెనీ సిబ్బంది సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. కొన్నిరోజుల ముందు కరోనా బారిన పడ్డ టేలర్ దాని నుంచి కోలుకున్నారు. ఆ తర్వాత కొవిడ్-19 అనంతర లక్షణాలతో సహా తీవ్రమైన చెవిపోటుతో(టిన్నిటస్) బాధపడిన ఆయన.. వాటితో పోరాడుతూ చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భరించలేని పరిస్థితిలో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, 1993 టెక్సాస్ రోడ్‌హౌసెస్ రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించిన టేలర్ అనతికాలంలోనే మంచి లాభాలు గడించారు. ఇక గతేడాది మహమ్మారి కాలంలో తన కెంపెనీలోని ఫ్రంట్ లైన్ వర్కర్లను ఆదుకునేందుకు తన జీతాన్ని మొత్తాన్ని విరాళంగా అందించారు. పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడంతో పాటు సేవ కార్యక్రమాల్లో కూడా టేలర్ ముందుడేవాడని ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు గుర్తు చేశారు.
Updated Date - 2021-03-23T15:38:18+05:30 IST