ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్ విషయంలో టెక్సాస్ కీలక నిర్ణయం !

ABN, First Publish Date - 2021-03-24T18:49:25+05:30

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం కరోనా వ్యాక్సినేషన్ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల చివరి నుంచి వయోజనులందరికీ కొవిడ్ టీకా వేయనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం కరోనా వ్యాక్సినేషన్ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల చివరి నుంచి వయోజనులందరికీ కొవిడ్ టీకా వేయనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు. మార్చి చివరి నుంచి రాష్ట్రంలోని వయోజనులందరూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ సెంటర్లలో విధిగా టీకా తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య సేవల విభాగం అసోసియేట్ కమిషనర్ ఇమెల్డా గార్సియా వెల్లడించారు. 16 ఏళ్లకు పైబడిన వారు ఫైజర్ టీకా తీసుకోవడానికి అర్హులని, అలాగే 18 ఏళ్లకు పైబడిన వారు మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ డోసులు తీసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తైనట్లు గార్సియా పేర్కొన్నారు. ఇలా అందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న రాష్ట్రాలలో అలాస్కా, అరిజోనా, మిస్సిసిప్పీల తర్వాత నాల్గో స్థానంలో టెక్సాస్ నిలిచింది. అటు కనెక్టికట్ కూడా 16 ఏళ్లకు పైబడిన వారందరికీ ఏప్రిల్ 5 నుంచి టీకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.  

Updated Date - 2021-03-24T18:49:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising