గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసిన వర్జీనియా!
ABN, First Publish Date - 2021-04-09T16:51:12+05:30
గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దక్షిణ అమెరికా రాష్ట్రంగా వర్జీనియా నిలిచింది.
వర్జీనియా: గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దక్షిణ అమెరికా రాష్ట్రంగా వర్జీనియా నిలిచింది. వ్యక్తిగత వినియోగం కోసం చిన్న మొత్తంలో గంజాయిని ఉపయోగించడాన్ని బుధవారం వర్జీనియా ఆమోదించింది. ఈ సందర్భంగా డెమొక్రాటిక్ గవర్నర్ రాల్ఫ్ నార్తామ్ మాట్లాడుతూ "గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసిన దక్షిణాదిలో మొట్టమొదటి రాష్ట్రంగా వర్జీనియా చరిత్ర సృష్టించింది" అని అన్నారు. ఇక వర్జీనియా తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం 21 ఏళ్లకు పైబడిన వారు వ్యక్తిగత వినియోగం కోసం 28.3 గ్రాముల వరకు గంజాయిని కలిగి ఉండొచ్చు. అయితే, బహిరంగ ప్రదేశాల్లో వినియోగించకూడదు. న్యూయార్క్, కొలరాడోతో సహా ఇతర కొన్ని యూఎస్ రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి చట్టాలను ఆమోదించాయి.
Updated Date - 2021-04-09T16:51:12+05:30 IST