ప్రధానితో మాట్లాడిన కమలా హ్యారిస్.. వ్యాక్సిన్లు పంపుతామని హామీ!

ABN, First Publish Date - 2021-06-04T07:33:00+05:30

కరోనా సెండ్ వేవ్‌తో కష్టాలు పడుతున్న భారత్‌కు అండగా నిలుస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీతో గురువారం మాట్లాడిన ఆమె.. భారత్‌కు సాయం చేస్తామని మాటిచ్చారు. అంతర్జాతీయంగా 25 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని అమెరికా భావిస్తున్నట్లు కమల వెల్లడించారు.

ప్రధానితో మాట్లాడిన కమలా హ్యారిస్.. వ్యాక్సిన్లు పంపుతామని హామీ!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా సెండ్ వేవ్‌తో కష్టాలు పడుతున్న భారత్‌కు అండగా నిలుస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీతో  గురువారం మాట్లాడిన ఆమె.. భారత్‌కు సాయం చేస్తామని మాటిచ్చారు. అంతర్జాతీయంగా 25 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని అమెరికా భావిస్తున్నట్లు కమల వెల్లడించారు. ఈ ప్లాన్ గురించి ఆమె మోదీతో చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత మరో మూడు దేశాల అధినేతలతో కూడా కమల ఈ విషయంపై మాట్లాడారు. ఈ క్రమంలోనే భారత్‌కు కూడా వ్యాక్సిన్ అందజేస్తామని ఆమె చెప్పారు. కమల ఇచ్చిన హామీకి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘భారత్‌కు వ్యాక్సిన్ సరఫరా ఇస్తామని ఇచ్చిన హామీకి మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నా’’ అని మోదీ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-06-04T07:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising