తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడకలు
ABN, First Publish Date - 2021-12-14T18:40:19+05:30
తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా (తాకా) శనివారం రోజు మిస్సిసాగ నగరంలోని కెనెడియన్ కాప్టిక్ చర్చి వద్ద ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. మొదటగా కెనడా, భారత దేశ భక్తి గీతాలను ఆలపించి రాణి మ
ఎన్నారై డెస్క్: తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా (తాకా).. శనివారం రోజు మిస్సిసాగ నగరంలోని కెనెడియన్ కాప్టిక్ చర్చి వద్ద ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. మొదటగా కెనడా, భారత దేశ భక్తి గీతాలను ఆలపించి రాణి మద్దెల, ఆర్నాల్డ్ మద్దెల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరినీ ఆహ్వానించి క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించారు.
తాకా అధ్యక్షురాలు కల్పన మోటూరి అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా కొవిడ్ నేపథ్యంలో తాకా చేసిన సేవ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్‌రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్లు అనిత సజ్జ, గణేష్ తెరల, రాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, వ్యవస్థాపక ఛైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, లోకేష్ చిల్లకూరు, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరి తదితరులను ఆమె అభినందించారు. చివరగా కార్యక్రమంలో పాల్గొన్న దాతలకు, అతిథులు తదితరులకు తాకా వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులు అరుణ్ కుమార్ లయం ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు.
Updated Date - 2021-12-14T18:40:19+05:30 IST